కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. మహానగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు సుమారు 3వేల ఓలా, ఊబర్ బుకింగ్లు నిలిపివేశామని తెలంగాణ రాష్ట్ర టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఐకాస కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
మోటార్ వాహన చట్టం - 2019ని రద్దు చేయాలని, బుకింగ్ రద్దుకు రూ.500ల జరిమానా నిలిపివేయాలని క్యాబ్ డ్రైవర్లు కేంద్రాన్ని కోరారు. ఈ-చాలన్స్ తీసేయాలని మొదటి నుంచి అభ్యర్థిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన