ETV Bharat / city

IPS Transfers in Telangana: రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్​ సీపీగా సీవీ ఆనంద్​ - ts ips transfers

IPS Transfers in Telangana
IPS Transfers in Telangana
author img

By

Published : Dec 25, 2021, 12:15 AM IST

Updated : Dec 25, 2021, 6:21 AM IST

00:03 December 25

రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్​ సీపీగా సీవీ ఆనంద్​

కొంత కాలంగా ఐపీఎస్‌ల బదిలీలపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఈస్థాయిలో చేపట్టలేదు. తాజా బదిలీల్లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. 2018 ఏప్రిల్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. ఊహించినట్లుగానే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసిన అంజనీకుమార్‌ను మరో కీలకమైన ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. డీసీపీలుగా ఉంటూ ఉన్నచోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్‌ శ్రీనివాస్‌, ఏవీ రంగనాథ్‌, కార్తికేయ, అవినాష్​ మహంతికి సుదీర్ఘవిరామం తర్వాత కొత్త కొలువులు దక్కాయి. నాన్‌కేడర్‌ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కె.ఆర్‌.నాగరాజ్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌తోపాటు.. నాన్‌కేడర్‌ ఎస్పీలుగా ఉన్న సందీప్‌, శ్రీనివాసరెడ్డి, సురేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మనోహర్‌, శిల్పవల్లి లాంటి అధికారులకూ కీలకమైన జిల్లా ఎస్పీలు, డీసీపీల స్థానం దక్కింది.

మరో విడత బదిలీలు..

హైదరాబాద్‌ నేర విభాగంలో పని చేసిన షికా గోయల్‌ను ఏసీబీ డైరెక్టర్‌గా నియమించారు. నల్గొండ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్‌ను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా బదిలీ అయ్యారు. మెదక్‌ ఎస్పీగా ఉన్న చందనా దీప్తిని హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్‌ భగవత్‌కు స్థానచలనం కలగలేదు. దీన్ని బట్టి త్వరలో మరో విడత బదిలీలుంటాయని తెలుస్తోంది.

  • అ.ని.శా. డీజీగా అంజనీకుమార్‌
  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సి.వి. ఆనంద్‌
  • అ.ని.శా. డైరెక్టర్‌గా షికా గోయల్‌
  • హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఎ.ఆర్‌. శ్రీనివాస్
  • హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఎ.వి. రంగనాథ్‌
  • నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి
  • సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌. శ్వేత
  • హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డేవిస్‌
  • హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ
  • మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని
  • సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా కమలేశ్వర్‌
  • సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్​ మహంతి
  • హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి
  • హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌
  • హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి.విశ్వప్రసాద్‌
  • మహబూబూబాద్ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌
  • హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి
  • వికారాబాద్‌ ఎస్పీగా కోటిరెడ్డి
  • నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కె.ఆర్‌.నాగరాజు
  • ఆదిలాబాద్‌ ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి
  • ఆసిఫాబాద్‌ ఎస్పీగా కె.సురేశ్‌కుమార్‌
  • నిర్మల్‌ ఎస్పీగా సి.హెచ్‌.ప్రవీణ్‌కుమార్‌
  • నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా కె.మనోహర్‌
  • మాదాపూర్‌ డీసీపీగా కె.శిల్పవల్లి
  • బాలానగర్‌ డీసీపీగా సుదీప్‌ గోనె
  • కామారెడ్డి ఎస్పీగా బి.శ్రీనివాస్‌ రెడ్డి
  • జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా జె.సురేందర్‌ రెడ్డి
  • శంషాబాద్‌ డీసీపీగా ఆర్‌.జగదీశ్వర్‌ రెడ్డి
  • జనగామ డీసీపీగా పి.సీతారామ్‌
  • నారాయణపేట ఎస్పీగా ఎన్‌.వెంకటేశ్వర్లు

ఇదీచూడండి: IAF fighter plane: కుప్పకూలిన మిగ్​-21 యుద్ధ విమానం- పైలట్ మృతి

Last Updated : Dec 25, 2021, 6:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.