ETV Bharat / city

కరోనా ఉద్ధృతి: కొత్తగా మరో 2,924 కరోనా కేసులు, 10 మరణాలు

2924 new coronavirus cases reported in telangana

author img

By

Published : Aug 30, 2020, 9:13 AM IST

Updated : Aug 30, 2020, 11:29 AM IST

09:12 August 30

కరోనా ఉద్ధృతి: కొత్తగా మరో 2,924 కరోనా కేసులు, 10 మరణాలు

2924 new coronavirus cases reported in telangana
కరోనా పంజా: కొత్తగా మరో 2,924 కరోనా కేసులు, 10 మరణాలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. మరణాల సంఖ్య తక్కువగా ఉందని.. రికవరీ రేటు మెరుగ్గా ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 61,148 పరీక్షల ఫలితాలు రాగా.. 2,924 మందికి వైరస్‌ సోకినట్లు పేర్కొంది. తాజాగా కరోనాతో 10 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 818కి చేరింది.  

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,90కి చేరింది. తాజాగా 1,638 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 90,988కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,284 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇంకా 1,801 నమునాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 13,27,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 24,176 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.  

జీహెచ్​ఎంసీ పరిధిలో 461 మందికి కొత్తగా పాజిటివ్‌ సోకింది. జిల్లాలవారీగా చూస్తే రంగారెడ్డి 213, ఖమ్మం 181, కరీంనగర్‌ 172, నల్గొండ 171, మేడ్చల్‌ 153, నిజామాబాద్‌ 140, సూర్యాపేట 118, వరంగల్‌ అర్బన్‌ 102 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య రెండంకెల్లో నమోదైంది. దేశంలో కరోనా రికవరీ రేటు 76.63శాతం ఉండగా.. రాష్ట్రంలో 73.9గా ఉందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వైరస్‌ మరణాల రేటు 1.79శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.66 శాతంగా ఉందని స్పష్టం చేసింది.

Last Updated : Aug 30, 2020, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.