ETV Bharat / city

కాంగ్రెస్​కు కలిసి రాని 2019!

2019 కాంగ్రెస్​కు కలిసిరాలేదు. నిరాశే మిగిల్చింది. పార్టీలో నేతల మధ్య అంతర్గత విబేధాలు, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనం, ప్రతిపక్ష హోదా కోల్పోవడం, సీనియర్‌ నేతలు పార్టీని వీడడం లాంటి పరిణామాలు ఆ పార్టీని కుంగదీశాయి. పార్లమెంటు ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితాలొచ్చినా.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఓటమితో పార్టీ పూర్తిగా డీలాపడక తప్పలేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు చేరువ కావాల్సిన కాంగ్రెస్‌ నేతలు అంతర్గత కుమ్ములాటలకే పరిమితమయ్యారు.

congress
congress
author img

By

Published : Dec 31, 2019, 8:32 AM IST

Updated : Dec 31, 2019, 2:05 PM IST

కాంగ్రెస్​కు కలిసి రాని 2019!

తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఏడాది ఆశించిన మేలు చేకూర్చలేదు. చేదునే మిగిల్చింది. ఎందులోనూ కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయి విజయాన్ని చేజిక్కించుకోలేకపోయారు. 2018 చివరలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో... తెరాస, భాజపాయేతర పార్టీలతో ఏర్పాటైన ప్రజా కూటమి ఫలితాలు తారుమారు కావడం వల్ల... 2019 ఆరంభం నాటికి చిన్నాభిన్నమైంది.

తమ వారిని కాపాడుకోలేక పోయారు

హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 19 మందిలో 12 మంది తెరాసలోకి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామాతో కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆ పార్టీ ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఉన్న ఆరుగురిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భాజపాకు అనుకూల ప్రకటనలు చేయడం, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడం లాంటి అంశాలతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి అంటీముట్టనట్లు ఉంటున్నారు.

ఎవరికి వారే...

మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేల్లోనూ ఐక్యత కొరవడి ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. అంతర్గత కుమ్ములాటల్లో... మాజీ మంత్రి డీకే.అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితోపాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి నేతలు అధికార తెరాసలో చేరారు. సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్​ గౌడ్​ల మృతితో పార్టీకి తీరని లోటు ఏర్పడింది. ఫిరాయింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేసినా.. అధికార పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జనంలోకి తీసుకెళ్లలేక పోయారు.

వరుస అపజయాలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్‌ పార్టీ కాస్త ఊపిరిపీల్చుకుంది. కొన్నిస్థానాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నికల బరిలోకి దిగిన ఆయన భార్య పద్మావతి ఓటమి పాలయ్యారు. మండల, జిల్లా పరిషత్​ ఎన్నికల్లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఒక్క జడ్పీ ఛైర్మన్​ పదవిని కూడా సాధించలేకపోయింది. వరుస దెబ్బలతో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లలేకపోయారు. స్థానిక పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేశాయి.

ప్రతిపక్ష పాత్ర పోషించలేదు!

ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం.. అధ్యక్షుడు ఎవరో తెలియక కొంతకాలం పార్టీలో స్తబ్దత నెలకొంది. ఇంటర్ బోర్డు వ్యవహారం, నల్లమల యూరేనియం తవ్వకాలు, ఆర్టీసీ సమ్మె తదితర విషయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోయింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడినప్పటికీ... జనసేన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరు కావడం... ఆ పార్టీలో చిన్నపాటి తుపానే సృష్టించింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

కొరవడిన సమన్వయం

ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులకు మద్దతుగా ప్రగతిభవన్‌ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిస్తే.. కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. తెరాస ప్రభుత్వంపై, సమస్యలపై పోరాటం చేయడం కానీ, ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి పెంచడం కానీ చేయలేకపోయింది. కేవలం మీడియా సమావేశాలకు, ఇష్టాగోష్ఠిలకే పరిమితమైంది. సమావేశాల పేరుతో గోల్కొండ హోటల్, గాంధీ భవన్‌లకే పరిమితమై సమయం వృథా చేస్తూ వచ్చారే తప్ప నేతల మధ్య సమన్వయం, చిత్తశుద్ధి లేక ఏ ఒక్క పనిని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో 2020లో ఆ పార్టీ పరిస్థితులు ఏలా ఉంటాయో వేచి చూడాలి.

ఇదీ చూడండి: రివ్యూ 2019: సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ మోదీ ప్రభుత్వం

TG_HYD_02_26_CONG_YEARLY_ROUNDUP_PKG_3038066 Reporter: ఎం.తిరుపాల్‌ రెడ్డి ()వికారినామ సంవత్సరం 2019 కాంగ్రెస్‌ కలిసిరాలేదు. నిరాశే మిగిల్చింది. పార్టీ లో నేతల మధ్య అంతర్గత విబేధాలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనం, ప్రతిపక్ష హోదా కోల్పోవడం, సీనియర్‌ నేతలు పార్టీని వీడడం లాంటి పరిణామాలు ఆ పార్టీని కుంగదీశాయి. పార్లమెంటు ఎన్నికలు గుడ్డిలో మొల్లలా కొంత సానుకూల పలితాలొచ్చినా..హూజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఓటమితో పార్టీ పూర్తిగా డీలాపడక తప్పలేదు. ప్రజాసమస్యలపై పోరాటం చేసి ప్రజలకు చేరువ కావాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటలకే పరిమితమయ్యారు. LOOk వాయిస్ఓవర్‌1: వికారినామ సంవత్సరం తెలంగాణ కాంగ్రెస్‌కు ఆశించిన మేలు చేకూర్చలేదు. చేదునే మిగిల్చింది. ఎందులోనూ కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయి విజయాన్ని చేజిక్కించుకోలేకపోయఆరు. 2018 చివరలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో...తెరాస, బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటైన ప్రజా కూటమి ఫలితాలు తారుమారు కావడంతో...2019 ఆరంభం నాటికి చిన్నా బిన్నమైంది. కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ గులాబి కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 19 మందిలో 12 మంది తెరాసలోకి, హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజినామాతో కేవలం ఆరుగురు మాత్రమే మిగిలిఆరు. ఆ పార్టీ ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఉన్నఆరుగురి ఎమ్మెల్యేల్లో కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీకి అనుకూల ప్రకటనలు చేయడం, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడం లాంటి అంశాలతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఇక మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలల్లో కూడా ఐక్యత కొరవడి ఎవరికి వారే ఎమునా తీరే లా ఉంటున్నారు. మరొక వైపు కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల్లో ...మాజీ మంత్రి డి.కే.అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలతోపాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌ అయ్యారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి నేతలు అధికార తెరాసలో చేరారు. ఇంకోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ల మృతి పార్టీకి తీరని లోటు ఏర్పడింది. రాజకీయ ఫిరాయింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేసినా.. అధికార పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జనంలోకి వద్దకు తీసుకెళ్లలేక పోయారు. వాయిస్ఓవర్‌2: ఆ తరువాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజా కూటమితో సంబంధం లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీనే పోటీ చేసింది. అతి కష్టం మీద...నల్లగొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు విజయం సాధించడం కాంగ్రెస్‌ పార్టీ కాస్త ఊపిరిపీల్చుకుంది. కొన్ని పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామ చేయడంతో...అక్కడ నుంచి ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ఆయన భార్య పద్మావతి ఓటమి పాలయ్యారు. దెబ్బ మీద దెబ్బ వరుస దెబ్బలతో కాంగ్రెస్‌ పార్టీలో...కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లలేకపోయారు. స్థానిక పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేసాయి. ప్రధానంగా 370 ఆర్టికల్ విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై తర్జనభర్జనలు చేయాన్ని సమర్దించాలో..,వ్యతిరికించాలో అర్దం కానీ పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పటికే పలువురు నేతలు హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టికల్‌ 370 ని కాదని...అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి. దీంతో పార్టీ లో నేతలు మధ్య విభేదాలు తలెత్తాయి. అంతకంటే ముందు ట్రిపుల్ తలాక్ విషయంలో ను అదే పరిస్థితి.. వాయిస్ఓవర్‌3: ఇక రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం..అధ్యక్షుడు ఎవరో తెలియక కొంత కాలం పార్టీలో స్తబ్దత నెలకొంది. ఇందుకు తోడు ఇంటర్ బోర్డు వ్యవహారంలోకాని, ఇక నల్లమల యూరేనియం తవ్వకాల విషయంలోకాని, ఆర్టీసీ సమ్మె విషయంలోకాని ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోయింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడినప్పటికీ...జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరు కావడం...ఆ పార్టీలో చిన్నపాటి తుఫానునే సృష్టించింది. దాదాపు రెండు వారాలు పాటు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిస్తే..దానిని కూడా కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. ఇక ప్రజా సమస్యలపై తెరాస ప్రభుత్వంపై పోరాటం చేయడంకాని, ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి పెంచడంకాని చేయలేకపోయింది. కేవలం మీడియా సమావేశాలకు, ఇష్టాగోష్టిలకే పరిమితమైంది. సమావేశాల పేరుతో గోల్కొండ హోటల్, గాంధీ భవన్‌లకే పరిమితమై సమయం వృధా చేస్తూ వచ్చారే తప్ప నేతల మధ్య సమన్వయం, చిత్తశుద్ధి లేక ఏ ఒక్క పనిని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో 2020లో ఆ పార్టీ పరిస్థితులు ఏలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
Last Updated : Dec 31, 2019, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.