ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్‌తో 20మంది ప్రాణాలు విడిచారు. మహమ్మరి నుంచి మరో 1,648 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనాతో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 225, పశ్చిమ గోదావరి జిల్లాలో 195 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు