రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల వరకు నిత్యావసరాల కోసం వ్యాపార సముదాయాలు, మార్కెట్ల దగ్గర... ఉబ్బడి ముబ్బడిగా ప్రజలు గుమిగూడారు. పోలీసుల హెచ్చరికలతో... ఆ తర్వాత ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 తర్వాత బయటకు వచ్చే వాహనదారులను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.