తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగింది. ఆదివారం వెయ్యికి దిగువగా కేసులు నమోదవ్వగా తాజాగా ఆ సంఖ్య 1500 దాటేసింది.. సోమవారం రాత్రి 8 గంటల వరకు 45,021 శాంపిల్స్‌ని పరీక్షించగా... 1,536 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
సోమవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,351కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,421 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,23,413కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 14,915 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 281 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43,94,330 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.
ఇవీ చూడండి: కొవిడ్ రికవరీల్లో భారత్‌యే టాప్.!