హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 136 మంది యూకే వాసులు ఇవాళ ప్రత్యేక విమానం స్వదేశానికి తీసుకెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానం.. ఇవాళ సాయంత్రం 6.46 గంటలకు 136 మందిని ఎక్కించుకుని అహ్మదాబాద్ వెళ్లింది. అక్కడ మరికొందరిని ఎక్కించుకొని బహ్రెయిన్‌కు వెళ్తుంది. అక్కడ ఉన్న మరికొందరితో లండన్‌కు వెళ్లనుంది.
ఎయిర్ కార్గో అధికారులు.. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగువేల మందికిపైగా బ్రిటిష్ పర్యాటకులను స్వదేశానికి పంపడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణానికి ముందే 136 మందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: ఏపీకి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు