ETV Bharat / city

ఈఎస్​ఐ ఔషధ కుంభకోణం@13 మంది అరెస్టు - 13 people arrested for ESI drug scam

ఈఎస్​ఐ ఔషధ కుంభకోణం కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకొస్తోంది. ఈకేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు వేగం పెంచింది. నిన్న అరెస్టు చేసిన ముగ్గురితో కలిపి 13కి చేరింది. ఐఎంఎస్​ అధికారులు, సిబ్బంది, ఫార్మా సంస్థల ప్రతినిధుల అక్రమాలు నిగ్గు తేల్చే పనిలో అనిశా  నిమగ్నమైంది.

ఈఎస్​ఐ ఔషధ కుంభకోణం@13 మంది అరెస్టు
author img

By

Published : Oct 8, 2019, 4:50 AM IST

Updated : Oct 8, 2019, 6:23 AM IST

తీగ లాగితే డొంకే కదులుతోంది... రాష్ట్రంలో మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 10మందిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరవింద్‌రెడ్డి, సిబ్బంది రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిని అరెస్టు చేశారు.

ఈఎస్​ఐ ఔషధ కుంభకోణం@13 మంది అరెస్టు

పద్మతో కుమ్మక్కైన అరవిందరెడ్డి...
ఐఎంఎస్​ విభాగం సంయుక్త సంచాలకురాలు పద్మతో కుమ్మక్కైన అరవిందరెడ్డి... వైద్య శిబిరాల్లో రోగులకు ఇవ్వాల్సిన వైద్య కిట్లు, ఔషధాలను ఆమె సాయంతో పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన దానిలో తన కమిషన్‌ తీసుకుని, మిగతా మొత్తాన్ని పద్మకు ఇచ్చేవాడని తేల్చారు. గత కొన్నేళ్లుగా అరవింద్‌ ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడని వెల్లడైంది.

2 రోజుల పాటు అనిశా కస్టడీలోకి నిందితులు..?
రేపటి నుంచి 2 రోజుల పాటు దేవికారాణి, పద్మ, రాధిక సహా మరో నలుగురిని కోర్టు అనుమతితో అనిశా తమ కస్టడీలోకి తీసుకోనుంది. నిందితులను 2 రోజుల పాటు పూర్తిస్థాయిలో విచారిస్తే మందుల కొనుగోలు కుంభకోణంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది.

ఇంకా అరెస్టులు జరిగే అవకాశం..?
మందుల కొనుగోలు కుంభకోణంలో 13 మంది అరెస్టు కాగా... మరింత మందిని అనిశా అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నేరం రుజువైతే ఎంత్తటివారికైనా శిక్ష తప్పదని హెచ్చరించింది.

ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్​ విజయదశమి శుభాకాంక్షలు

Intro:Body:Conclusion:
Last Updated : Oct 8, 2019, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.