రాష్ట్రంలో పన్నెండో రోజు లాక్‌డౌన్ ఆంక్షలు పక్కాగా అమలవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సేవలు తప్ప ఎవరూ బయటకు వచ్చిన తమదైన శైలి చూపిస్తున్నారు.
మొన్నటి వరకు జరిమానాలతో వదిలిపెట్టగా... సీఎం, డీజీపీ ఆదేశాలతో ఇప్పుడు లాఠీలకు పని చెబుతున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు బండ్లు ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఆదివారం కావడం వల్ల పలు ప్రాంతాల్లో మాంసం కోసం ప్రజలు బారులు తీరారు. ఈ క్రమంలో కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగింది.
మొదట ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలు ఉదయం 10 గంటలకే పరిమితం చేసిన అధికారులు.. మంత్రి కేటీఆర్ చొరవతో వాటికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని పోలీసులు కోరారు.