ETV Bharat / city

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతి.. - ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

10th Exams in AP : ఏపీలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. హాల్ టికెట్లను నేరుగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్​ దేవానంద రెడ్డి తెలిపారు.

10th-exams-start-today-in-andhra-pradesh

author img

By

Published : Apr 27, 2022, 5:56 AM IST

AP SSC Exams: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లిస్తేనే హాల్‌ టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నందున.. నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సహేతుక కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వెళ్లినా అనుమతిస్తామన్నారు.

ఈ ఏడాది 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో బాలికలు 3,02,474మంది ఉన్నారు. 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహేతుక కారణాలతో విద్యార్థులు అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తారు. పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి 12.45గంటల వరకు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి.

పది పరీక్ష కేంద్రాలు ఉంటే పని వేళల్లో మార్పు: పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల పని వేళలను మార్పు చేశారు. 6-9 తరగతులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.45 వరకు మధ్యాహ్న భోజనం, రెండు గంటల నుంచి 4.45 గంటల వరకు ఎస్‌-2 పరీక్ష ఉంటుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.