ETV Bharat / city

దయనీయం.. బైక్​ పైనే బాలుని మృతదేహం తరలింపు..

Dead body on two wheeler: ఏపీలో తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్​ సిబ్బంది ఘటన మరువక ముందే మరోచోట అదే పరిస్థితి ఏర్పడింది. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి... తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహనాన్ని అడిగితే... నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించారు. ఎవరూ సాయం చేయకపోవడంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన దయనీయమైన ఘటన అందరినీ కలచివేసింది.

Dead body on two wheeler
Dead body on two wheeler
author img

By

Published : May 5, 2022, 1:49 PM IST

Dead body on two wheeler: రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సాయం చేయాల్సింది పోయి.. అక్కడ కూడా డబ్బులు, రూల్స్​ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణం. ఈ మధ్యే ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించేందుకు బయటి వాహనాన్ని అనుమతించని అంబులెన్స్​ మాఫియాను చూశాం. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. ఇప్పుడు అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది.

సంగంలో బుధవారం శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు అబ్బాయిలు బహిర్భూమికి వెళ్లి... కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 వాహన సిబ్బందిని కోరగా.. నిబంధనలు అంగీకరించవంటూ వారు నిరాకరించారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు. ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా ఎవరూ ముందుకు రాలేదు. గత్యంతరం లేక ద్విచక్ర వాహనంపైనే శ్రీరామ్‌ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

ఇదీ చదవండి: ఇంట్లో బంగారం మాయం.. ఏమైందని చూస్తే బయటపడ్డ కుమార్తె వ్యవహారం.. ఏమైందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.