ఏపీలో ఆదివారం కొత్తగా 1,056 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,54,011కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 6,868 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా... ప్రస్తుతం 18,659 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 53,215 కరోనా పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 91.54 లక్షలకు చేరింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు...
అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 154, కృష్ణాలో 153, తూర్పుగోదావరిలో 139, చిత్తూరులో 87, అనంతపురంలో 70, విశాఖలో 57, కడపలో 47, ప్రకాశంలో 37, నెల్లూరులో 30, కర్నూలులో 27, విజయనగరంలో 25, శ్రీకాకుళంలో 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు... ముగ్గురు మృతి