ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసీనా (40)కు ఐదుగురు పిల్లలు. భర్త మరణించారు. పిల్లలతో కలసి కూలిపనులు, భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. సంచార బృందంతో కలిసి కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చారు. ముగ్గురు పిల్లలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బృందంతో కలిసి బెంగళూరులోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. లాక్‌డౌన్ వల్ల కుమారుడు షారుఖ్, చిన్న కుమార్తె మున్నీతో పాటు హసీనా హైదరాబాద్‌లో ఉండిపోయారు. ఆమె కాలు సరిగా లేక నడవలేని పరిస్థితి. షారుఖ్ తన తల్లిని, చెల్లిని చక్రాల కుర్చీపై కూర్చోబెట్టుకుని బెంగళూరు బయలుదేరాడు. అక్కడున్న తన ముగ్గురు తోబుట్టువులను కలుసుకుని, కలోగంజో కలిసే తాగాలనేది పిల్లాడి తపన.
జూన్ మొదటి వారంలో ప్రయాణం ప్రారంభించారు. దారిలో భిక్షాటన చేసుకుంటూ దాతలు ఇచ్చిన ఆహారంతో ఆకలితీర్చుకుంటూ వెళ్తున్నారు. వెల్దుర్తికి చెందిన యువకులు కొందరు ఆదివారం షారుఖ్‌తో మాట్లాడగా అసలు విషయం తెలిసింది. ఆ యువకులు వెల్దుర్తి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డికి పరిస్థితిని వివరించారు. ఆయన స్పందించి డోన్‌లోని ద్రోణాచలం సేవాసమితి సభ్యులను సంప్రదించారు. అందరూ తలాకొంత డబ్బు పోగుచేసి, బాలుడు, తల్లీకుమార్తెలను ప్రత్యేక వాహనంలో బెంగళూరు పంపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్..!