దేశ ప్రధానిని తెలంగాణ ప్రజలే నిర్ణయించాలంటే 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. మోదీ అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిపించారని తెలిపారు. ఇప్పుడు మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ గాడి తప్పిందని విమర్శించారు. రైతు బంధు నకలు కొట్టి ఏపీలో అన్నదాత సుఖీభవ, కేంద్రంలో పీఎం కిసాన్ యోజన పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఇవీ చూడండి:సిని'మా' రాజకీయం ముదురుతోందా!