కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సతీమణితో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డా.పాల్వాయి హరీష్‌బాబు అదే కేంద్రంలో ఓటు వేశారు.