ఎదురింటి వారికి సాయం చేయడానికి వెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు ఓ యువకుడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తుర్కపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బోర్ మెకానిక్ కార్తీక్‌తో కలిసి అభిలాష్ అనే యువకుడు చేతి పంపునకు మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ తీగలకు పైపులు తాకాయి.
దీంతో అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందగా. తీవ్ర గాయాలపాలైన కార్తీక్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిలాష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కన్నెపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఒక్కరోజే విద్యుదాఘతంతో ఐదుగురు మృతిచెందడం కలవరానికి గురిచేస్తోంది.