ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు నిండు కుండలా మారాయి. జలపాతాలు జలకళ సంతరించుకుని పాలనురగలతో పరవళ్లు తొక్కుతున్నాయి. రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల మొదలుకొని పొచ్చర, కనకాయి. సప్త గుండాల జలపాతాల నుంచి గంగ పొంగి పొర్లుతోంది.
జలపాతాల హొయలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, రాళ్ల మధ్య నుంచి పరవళ్లు పెడుతోన్న జలపాతాన్ని చూడటానికి పర్యటకులు కొలువుదీరారు.
- ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!