ETV Bharat / city

ముందు అభ్యర్థుల విజయం... తర్వాతే ఛైర్మన్​పై నిర్ణయం​

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న తెరాస ఆయా జిల్లాల బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. నిర్మల్​, ఆదిలాబాద్​ జిల్లాల జడ్పీలో పాగావేయాలని అధిష్ఠానం స్పష్టం చేయగా.. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ముందు అభ్యర్థుల విజయం... తర్వాతే ఛైర్మన్​పై నిర్ణయం​
author img

By

Published : May 4, 2019, 12:18 PM IST

ముందు అభ్యర్థుల విజయం... తర్వాతే ఛైర్మన్​పై నిర్ణయం​

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిక్యతను సాధించాలనే లక్ష్యంతో తెరాస అధిష్ఠానం పావులు కదుపుతోంది. నిర్మల్‌ జడ్పీ కైవసం చేసుకునే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ దక్కించుకునే బాధ్యత మాజీ మంత్రి జోగు రామన్నకు అప్పగించింది.

మంత్రి ఇంద్రకరణ్​ సుడిగాలి పర్యటనలు

నిర్మల్‌ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుంటే... జడ్పీ పాలన పగ్గాలు చేపట్టాలంటే పది స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... ఇప్పటికే జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ బాధ్యతలను తెరాస మాజీ మంత్రి జోగు రామన్నకు తెరాస అప్పగించింది. 17 జడ్పీటీసీ స్థానాలు ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో తెరాస కనీసం తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోవాల్సి ఉంది.

గెలుపుపైనే దృష్టంతా

కుమురం భీం ఆసిఫాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మిని జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థులుగా ప్రకటించినప్పటికీ... నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఖరారు చేయలేదు. ఛైర్మన్‌ స్థానానికి అవసరమయ్యే స్థానాలను గెలిపించుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ఛైర్మన్​ ఎంపిక అధిష్ఠానం నిర్ణయిస్తుందని... అందుకే అసంతృప్తి బయటకు పొక్కడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : 'పాముల కంటే 'మౌస్'​ పట్టుకునే వారే ఎక్కువ'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.