South Korea Emergency Martial Law : దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించిన ఆయన 'ఎమర్జెన్సీ మార్షల్ లా' (సైనిక అత్యవసర పరిస్థితి) విధించారు. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
పొరుగు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా పార్లమెంట్‌ను కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అందుకే అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తోందని యూన్ సుక్ యోల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, రాజ్యాంగ పరిరక్షణ చర్యల్లో భాగంగానే కీలకమైన ఎమర్జెన్సీ మార్షల్‌లాను అమల్లోకి తీసుకొచ్చినట్లు యూన్ తెలిపారు.
అయితే, ఈ చర్యలు దక్షిణ కొరియా పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని ఎంత వరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. యూన్ 2022లో దక్షిణ కొరియా అధ్యక్షపగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న పార్లమెంట్‌కు వ్యతిరేకంగా తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి- హమాస్‌కు ట్రంప్ వార్నింగ్!
ఏడాదిలో రూ.53లక్షల కోట్ల బిజినెస్- యుద్ధాల వేళ వెపన్ కంపెనీస్‌కు గట్టి లాభాలు!