ETV Bharat / city

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 42 చేరిన కేసులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాత జిల్లా వ్యాప్తంగా 42 మందికి వైరస్ సోకింది. నిర్మల్‌ జిల్లాలో 20, ఆదిలాబాద్​ జిల్లాల్లో 21, ఆసిఫాబాద్​లో ఒకరికి వైరస్​ సోకింది. ఇప్పటి వరకు ఏడుగురు డిశార్జ్​ అయ్యారు. మిగిలిన వారికి హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

total 42 positive cases registered in adilabad dist
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 42 చేరిన కేసులు
author img

By

Published : Apr 25, 2020, 5:24 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 42కి చేరుకుంది. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదైతే.. ఇప్పటికి ఇద్దరు డిశ్ఛార్జ్​ అయ్యారు. మిగిలిన 18 మంది హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 21 మందికి వైరస్​ సోకగా.. ఐదుగురు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. మిగిలిన 16 మందికి గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మర్కజ్‌ యాత్రికునికి మూడోసారి పరీక్షలు జరపగా.. పాజిటివ్‌ వచ్చింది. తాజా కేసుతో కలిపి బాధితుల సంఖ్య ఏడుగురికి చేరింది. వీరందరూ హైదరాబాద్‌లో ఉన్నారు.

మంచిర్యాలలో పాజిటివ్ వచ్చిన మహిళ ఇది వరకే మృతి చెందగా... ఇప్పుడు పాత జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో ప్రధాన మార్గాలతో పాటు.. గల్లీల్లోనూ రాకపోకలపై పూర్తి స్థాయి నిఘా ఉంది. ఆదిలాబాద్‌ పాలనాధికారి శ్రీదేవసేన ఏజెన్సీలో పర్యటించారు. కొలాం తెగకు చెందిన ఆదివాసీలకు నిత్యావసర సరకులు పంపిణీచేశారు. జిల్లా కేంద్రంలో పోలీసు బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.