Basara RGUKT update: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనను నాలుగో రోజు కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. సౌకర్యాల కొరత, యాజమాన్యం నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు ఆర్జీయూకేటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని, బాసర ఆర్జీయూకేటీని సీఎం సందర్శించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై హామీ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు వేల మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు నిరసనలో పాల్గొనేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటుకుని లోపలికి వెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలు పార్టీలు విద్యార్థుల ఆందోళనలకు మద్దతివ్వగా... ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయల్దేరారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన బండి సంజయ్‌ను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:బాసరకు బయల్దేరిన బండి సంజయ్.. అరెస్ట్ చేసిన పోలీసులు