కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం.. ప్రజలకు సేవలందిస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా బాధితులంతా భయపడకుండా.. పౌష్టికాహారం తీసుకుంటూ.. వైద్యుల పర్యవేక్షణలో ఉండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్యప్రదాయిని రిమ్స్ ఆస్పత్రిలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. దీనికోసం సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వీలైనంత త్వరగా జిల్లా వైద్య శాఖలో 650 పోస్టులు భర్తీ చేస్తామంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...
- ఇదీ చదవండి : దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం