ETV Bharat / city

వివిధ కళల్లో చిన్నారులను శిక్షితులుగా చేస్తోన్న 'బాలకేంద్రం' - వేసవి శిక్షణ శిబిరం

Bala Kendram in Adilabad: కరోనా ప్రభావంతో మైదానంలో ఆట, పాటలు మాని... ఇంటికే పరిమితమవుతున్న తమ పిల్లల్లో మార్పు రావాలని కోరుకుంటున్న తల్లిదండ్రులకు... ఆదిలాబాద్‌ పట్టణంలోని బాలకేంద్రం మంచి వేదికగా నిలుస్తోంది. ఇక్కడకు వచ్చిన పిల్లలు ఆయా కళల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సుశిక్షుతులైన శిక్షకులు వారిని మెరికల్లాగా తీర్చిదిద్దుతున్నారు. పూర్వ విద్యార్థులు సైతం ఇతోధికంగా తమ సేవలను అందిస్తున్నారు.

Bala Kendram
Bala Kendram
author img

By

Published : May 30, 2022, 2:37 AM IST

Updated : May 30, 2022, 7:43 AM IST

వివిధ కళల్లో చిన్నారులను శిక్షితులుగా చేస్తోన్న 'బాలకేంద్రం'

Bala Kendram in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బాల కేంద్రం ఇది. నెలరోజులుగా ఇక్కడ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కరోనాతో ఇంటిపట్టునే ఉంటున్న విద్యార్థులు సెల్‌ఫోన్‌ వీడాలంటే వారికి కళల పట్ల అభిరుచి పెంచడమే మార్గమని భావిస్తున్నారు తల్లిదండ్రులు. అలా భావించడమే తరువాయి ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలను బాలకేంద్రం బాట పట్టిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతోపాటు... సంగీతం, తబలా, హర్మోనియం, పియానో వంటి వాయిద్యాలను వాయించడమెలాగో ఇక్కడ నేర్పిస్తున్నారు.

అంతేకాదు ఆత్మరక్షణ కోసం కరాటేలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేలా చిత్రలేఖనంలోనూ.... బాల, బాలికలను తర్ఫీదునిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఉచిత శిక్షణా శిబిరానికి హాజరవుతున్న వందలాది మంది విద్యార్థులు.. ఆయా అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సైతం తన నాలుగేళ్ల కుమారుడు... సారంగ్‌ని బాల కేంద్రానికే పంపిస్తున్నారంటే ఇక్కడి సిబ్బంది ఇస్తున్న శిక్షణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ బాలుడు చిత్రలేఖనంతో పాటు కరాటేలో ఆసక్తి చూపుతూ... ఇతర విద్యార్థుల మాదిరిగానే వచ్చి తర్ఫీదు పొందుతున్నాడు.

వివిధ కళల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు... బాలకేంద్రం అంటే తమకెంతో ఇష్టమని చెబుతున్నారు. బాల కేంద్రంలో నేర్పిస్తున్న అంశాలపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ కొంతకాలంగా నృత్యం నేర్చుకున్న విద్యార్థినులే... ఇక్కడే గురువులుగా తోటి విద్యార్థినులకు నేర్పిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలతో... బాలకేంద్రం నిర్వాహకులుగా తాము గర్వపడుతున్నామని శిక్షకులు చెబుతున్నారు. విద్యార్థుల కళల వేదికైన బాల కేంద్రాన్ని... ఉన్నతీకరిస్తే … ఇక్కడి వారికి మరింత మేలు జరుగుతుందనే మాట.... జిల్లా వాసుల నుంచి వినిపిస్తోంది.

ఇవీ చదవండి:జార్జి బుష్‌ మెచ్చిన తెలంగాణ మామిడి... అగ్రరాజ్యంలో ఆమ్​గో బ్రాండ్ హవా

Last Updated : May 30, 2022, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.