ETV Bharat / city

'ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం' - నిర్మల్​ జిల్లా వార్తలు

నిర్మల్ బస్ ​డిపో ఎదుట ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమ్మె కాలపు వేతనాలు, పదవీవిరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని యూనియన్​ నేతలు డిమాండ్ చేశారు.

rtc employees union dharna at nirmal bus depo
నిర్మల్ బస్ ​డిపో ఎదుట ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా
author img

By

Published : Oct 6, 2020, 2:21 PM IST

నిర్మల్ బస్ ​డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమ్మె విరమించి 10 నెలలు గడుస్తున్నా ఉద్యోగ భద్రత సర్క్యులర్ జారీ చేయకపోవడం దారుణమని యూనియన్​ నేతలు మండిపడ్డారు.

సమ్మె కాలపు వేతనాలు, పదవీవిరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి రాజేశ్వర్, డివిజన్ కార్యదర్శి రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రెండోరోజూ కొనసాగుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.