ETV Bharat / city

అభివృద్ధి పథంలో నిర్మల్ జిల్లా కేంద్రం...: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister indrakaran reddy: నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యాక అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.3.40 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Minister indrakaran reddy
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Feb 24, 2022, 1:26 PM IST

Minister indrakaran reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభజన తర్వాత ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నిర్మల్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.3. 40 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పట్టణంలోని చైన్ గేట్ నుంచి పోస్టాఫీస్ వరకు 1.6 కిలోమీటర్ పొడవున 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి, మిని ట్యాంక్‌బండ్ వద్ద కోటి 40 లక్షలతో చేపట్టనున్న మినీ పార్క్, ఓపెన్ థియేటర్ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

' ఎన్నో ఏళ్లుగా ఇరుకు రోడ్డులో ప్రజలు ఇబ్బందులు ఎదురుకున్నారు. పాఠశాలల బస్సులు వెళ్లేందుకూ ఇబ్బంది ఎదురయ్యేది. ప్రజల సహకారంతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం జరుగుతుంది. అలాగే జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్‌బండ్ వద్ద పలు సుందరీకరణ పనులు చేపట్టాము. భవిష్యత్‌లో జిల్లాలోని వైద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాము. రాబోయే రోజులలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు చేపడతాము.'

-అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి

మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉన్నారు.

ఇదీ చదవండి:Grand Nursery Mela in Hyderabad : 5 రోజులు.. 150 స్టాళ్లతో కొలువుదీరిన గ్రాండ్ నర్సరీ మేళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.