ETV Bharat / city

మావోయిస్టు భాస్కర్‌ దళ సభ్యుడు లొంగుబాటు - kumuram bheem asifabad news

మావోయిస్టు భాస్కర్‌ దళం నుంచి ఓ సభ్యుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ సమక్షంలో లొంగిపోయాడు. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులే మావోయిస్టుల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని... తొందర్లోనే వారిపై అన్ని అధారాలతో చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Maoist surrender in kumurambheem asifabad

author img

By

Published : Oct 15, 2020, 7:42 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ మధ్యకాలంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మావోయిస్టు భాస్కర్‌ దళం నుంచి ఓ సభ్యుడు లొంగిపోయాడు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం చినదంపూర్‌ గ్రామానికి చెందిన కొడప లింగు... రెండు నెలల కింద దళంలో చేరాడు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ సమక్షంలో లింగు లొంగిపోయాడు.

జైనూరు, ఉట్నూర్‌ మండలాల్లో కొంత మంది ప్రభుత్వ టీచర్లు యువకులను మావోయిస్టు దళంలో చేరేలా ప్రోత్సహిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఆధారాలతో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దళంలో చేరిన వారు జనజీవన స్రవంతిలో చేరాలనుకుంటే నేరుగా తమను సంప్రదించవచ్చని... ప్రభుత్వం పరంగా అన్ని సదుపాయాలతో పాటు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: దాచుకున్న డబ్బులు పాయే... మనస్తాపంతో ప్రాణాలూ పోయే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.