ETV Bharat / city

కిడ్నీ వ్యాధి కబళిస్తోంది.. గిరిజనులకు బతుకు భారమైంది! - కిడ్నీ వ్యాధి

సాఫీగా సాగే జీవితాలు ఒక్కసారిగా ఒడిదొడుకులకు లోనయ్యాయి. వ్యవసాయం, కూలీ పనులు చేసుకునే పేదలను కిడ్నీ వ్యాధి చిన్నాభిన్నం చేస్తుంది. తరచూ ఆసుపత్రులకు వెళ్ళడానికి అప్పులు చేస్తూ.. ఆర్థికంగా కుదేలవుతున్నారు. రోజు వారి పనులు చేసుకోలేక భవిత కరువై... బతుకు బరువై ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కే వ్యాధికి గురై మంచాన పడడం వల్ల కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగులుతుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో బీమా నాయక్ తండాలో కిడ్నీ వ్యాధులతో బతుకులు ఆగమై గిరిజనులు కాలం వెళ్లదీస్తున్నారు.

Komuram Bheem District Tribal people Suffering From Kidney problems
కబళిస్తున్న కిడ్నీ వ్యాధి.. ఆర్థికభారం అవుతున్న వైద్యం
author img

By

Published : Oct 20, 2020, 5:56 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో లింగాపూర్ మండలం లొద్దిగూడ, వంజరి గూడలో కిడ్నీ వ్యాధి ప్రబలి... రెండు గ్రామాల్లో దాదాపు 40 మంది అవస్థ పడుతున్నారు. 2017లో హైదరాబాద్ నిమ్స్ వైద్యులు, అధికారులు ఇక్కడ వైద్య శిబిరాలు నిర్వహించి ఈ రెండు గ్రామాల్లోని ప్రజలకు వ్యాధి సోకుతుందని నిర్ధారించారు. వ్యాధి సోకడానికి కారణం సురక్షిత మంచినీరు లేకపోవడమే అని తేల్చారు. లొద్దిగూడ గ్రామాన్ని అక్కడినుంచి తరలించి, అందరికీ రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని అప్పటి పాలనాధికారి చంపాలాల్ హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేసినా ప్రస్తుతం పని చేయడం లేదు.

నీళ్లు లేవు.. రోడ్లు లేవు..
లింగాపూర్ మండలంలోని మారుమూల గ్రామం ఖీమానాయక్ తండాలో సైతం కిడ్నీ వ్యాధి విస్తరిస్తోంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 12 మంది బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు పర్యటించి జైనూర్​ వెళ్లాలి. లేదంటే.. 25 కిలోమీటర్లు తిరిగి తిర్యాని మండలంలోని గిన్నెధరి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు తెగి.. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత మంచి నీరు అందించడం కోసం.. ఏర్పాటు చేసిన భగీరథ నీళ్లు కూడా రంగుమారి రావడం వల్ల ప్రజలు బావి నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్ల వల్ల.. కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామానికి చెందిన జాదవ్ సజ్జన్​లాల్​ అనే వ్యక్తిని కిడ్నీ వ్యాధితో నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.

కబళిస్తున్న కిడ్నీ వ్యాధి.. ఆర్థికభారం అవుతున్న వైద్యం

పనులు చేసుకోలేకపోతున్నాం..

నిత్యం కూలిపనులకు, పొలాల దగ్గర వ్యవసాయ పనులు చేసుకునే వారే ఆ ప్రాంతంలో ఎక్కువ. కిడ్నీ వ్యాధి వల్ల ఎక్కువ సేపు పని చేస్తే.. వెన్నుముకలో తీవ్రమైన నొప్పి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నొప్పి భరించలేక అసలు పనులకే వెళ్లలేక పోతున్నామని.. పూట గడవటం చాలా కష్టంగా ఉందన ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వ్యాధిగస్తులు, గ్రామప్రజలు వేడుకుంటున్నారు.

అప్పులు తెచ్చి ఆసుపత్రికి..
ఆ ప్రాంతంలో ఉండేవారంతా.. చిన్నపాటి కమతాలు సాగు చేసుకొని బతికేవారే. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం.. చేసిన కష్టం సరిపోక అప్పులు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరకొరగా పండిన పంట పెట్టుబడి, అప్పులకే సరిపోగా.. చికిత్స కోసం.. స్థానిక వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు.

చికిత్స కోసం.. దూర ప్రాంతాలకు..

గ్రామంలో అనేక మంది కిడ్నీ చికిత్స కోసం హైదరాబాద్, మహారాష్ట్రలోని యవత్మాల్​కు వెళుతున్నారు. హైదరాబాదు వెళ్లి వచ్చేందుకు ఏడు వేల రూపాయలు ఖర్చవుతున్నాయని.. ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక భారంతో డయాలసిస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని.. వాపోతున్నారు. డబ్బులు లేక చాలామంది.. చికిత్స చేసుకోవడం కూడా మానేశారు. తమ బాధను అర్థం చేసుకొని జిల్లా అధికారులు, నాయకులు స్పందించి ఉచితంగా చికిత్స అందించి.. ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: భద్రాద్రిలో కనులవిందుగా దేవి శరన్నవరాత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.