ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు సమ్మె బాట పట్టారు. నెలలుగా ఉపకార వేతనాలు రావడం లేదని విధులు బహిష్కరించి... మూడు రోజులుగా ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్నారు. ఇవాళ ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. అధికారులు స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో.. పోస్టుల పునర్విభజనే కీలకం