ETV Bharat / city

దశల వారీగా మూడు కారిడార్లలో సేవలు ప్రారంభిస్తాం: మెట్రో ఎండీ - hyderabad metro md nvs reddy latest news

ఈ నెల 7 నుంచి హైదరాబాద్​ నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. దశల వారిగా సర్వీసులు పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొవిడ్​ లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

మెట్రో సేవల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి: మెట్రో రైల్ ఎండీ

author img

By

Published : Sep 5, 2020, 3:45 PM IST

Updated : Sep 5, 2020, 4:44 PM IST

సోమవారం నుంచి హైదరాబాద్​ నగరంలో దశల వారిగా మెట్రో సేవలు ప్రారంభిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ప్రయాణించాలని కోరారు. లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు.

మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తాం. స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తాం. అన్ని మెట్రో స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయిస్తాం. మెట్రో స్టేషన్లు, రైళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు. మెట్రో స్టేషన్లలో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ప్రతి ఐదు నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి... లేనివారు స్టేషన్​లో కొనుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంచుతాం. ప్రయాణికులు తక్కువ లగేజీతో ప్రయాణించాలి. రైళ్లలో 75 శాతం తాజా గాలి అందుబాటులో ఉంచుతాం. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. - ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ

దశల వారీగా మూడు కారిడార్లలో సేవలు ప్రారంభిస్తాం: మెట్రో ఎండీ

మూడు దశల్లో సర్వీసులు పునఃప్రారంభం..

తొలి ఫేజ్​లో భాగంగా ఈనెల 7న మియాపూర్- ఎల్బీనగర్​ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభిస్తామని.. రెండో ఫేజ్​లో 8న నాగోల్- రాయదుర్గం మార్గంలో.. మూడో ఫేజ్​లో బాగంగా సెప్టెంబరు 9న అన్ని మార్గాల్లో మెట్రో సేవలు పునరుద్ధరిస్తామని ఎన్వీఎస్​ రెడ్డి చెప్పారు. అయితే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. కంటైన్​మెంట్​ జోన్లుగా ఉన్న గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్, మూసాపేట్‌, ముషీరాబాద్, యూసఫ్​గూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తామని ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్​ రెడ్డి సమీక్ష

Last Updated : Sep 5, 2020, 4:44 PM IST

For All Latest Updates

TAGGED:

metro
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.