ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మలో మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయంతో పాటు మరికొన్ని అనుబంధ ఆలయాలు ఉన్నాయి. కాలక్రమంలో వీటిలో ఒకటి పూర్తిగా శిథిలమై కూలిపోగా అక్కడి ఆనవాళ్లు నేటికీ ఓ పంటపొలంలో కనిపిస్తున్నాయి. ఎంతో అద్భుతంగా చెక్కిన పెద్ద నంది విగ్రహం శిథిలాలుగా మారగా మరికొన్ని విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఇప్పటికీ కొందరు రాత్రి సమయాల్లో వచ్చి తవ్వకాలు జరుపుతున్నారంటూ గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా ప్రాచీన శిల్ప సంపద ఆనవాళ్లను కోల్పోతున్నా పురావస్తు శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇదే విషయమై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. సిరిచెల్మ మల్లికార్జున ఆలయంతో పాటు చుట్టూ ఉన్న ఆలయాలు 1200 ఏళ్ల క్రితం నాటివన్నారు. కాకతీయుల కాలంలో ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయని చెప్పారు.
ఇవీ చదవండి: