ETV Bharat / city

పులి క్షేత్రంలో అక్రమార్కులు దందా

చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల సంచారం, క్రూరమృగాల ఆనవాళ్లతో చూపరులను కట్టిపడేసే మనోహర దృశ్యాలతో కనువిందు చేసే కవ్వాల్‌ అభయారణ్యాన్ని ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రం (టైగర్‌ జోన్‌)గా ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిచేసి వన్యప్రాణులను రక్షిస్తూ... జీవవైవిధ్యాన్ని కాపాడాలని సంకల్పించింది. సర్కారు ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణలో చిత్తశుద్ధి కొరవడుతోంది. ఫలితంగా అక్రమార్కుల కారణంగా విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. జంతుజాలం, జీవరాశుల ఉనికే ప్రమాదకరంగా మారింది.

అక్రమార్కుల దందా
author img

By

Published : Jul 15, 2019, 9:47 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో విస్తరించిఉన్న కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892 చ.కి.మీ. కోర్‌ ప్రాంతంగా, 1,123 చ.కి.మీ. బఫర్‌ ప్రాంతంగా అధికారులు గుర్తించారు. 16 మండలాల్లోని అటవీ ప్రాంతం ఈ కేంద్రంలోకి వస్తుంది. అటవీ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ గట్టిగా చర్యలు చేపట్టాల్సి ఉండగా కార్యాచరణ అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు విలువైన కలపను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. వీరికి అటవీశాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమాయకులకు ఆశలు కల్పించి..

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న విలువైన కలప సంపదపై అక్రమార్కులు కన్నేశారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎత్తుగడలతో అక్రమాలకు పాల్పడడంలో దిట్టలుగా నిలుస్తున్న కలప స్మగ్లర్లు అటవీ హక్కు చట్టం చాటున అమాయకులను మభ్యపెడుతున్నారు. మీరు చెట్లు కొట్టుకోండి! మీ కష్టానికి మేము కూలీ చెల్లిస్తాం. కలప మేం తీసుకుంటాం. వ్యవసాయం చేసుకోవడానికి మీకు భూమి దక్కుతుంది. దాన్ని మీరు దున్నుకోండని నమ్మిస్తున్నారు. ఇస్లాంపూర్‌, పాండ్వాపూర్‌, బిర్సాయిపేట, బలాన్‌పూర్‌ అటవీ ప్రాంతాల్లోని విలువైన వనాలను నరికి వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను తరలించుకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పట్టుబడినా అక్రమ వ్యాపారాన్ని మాత్రం కొనసాగించడం గమన్హారం.

అటవీ హక్కు చట్టం సాకుతో...

వలస వచ్చి తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాలని 2005లో అటవీ హక్కు చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారం 13, డిసెంబరు-2005కు పూర్వం నుంచి అటవీ భూములను సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాల్సిఉంది. ఆ చట్టం ప్రకారం ఇప్పటివరకు ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో లక్షా ముప్పైవేల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 37,182 మంది రైతులకు హక్కుపత్రాలు ఇచ్చారు. అయితే ఆ చట్టాన్ని సాకుగా చేసుకొని కొందరు ఇతర ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతానికి వలస వచ్చి ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా అడవిలోని వృక్షాలను నరికి వేస్తున్నారు.

పీడీయాక్ట్‌ ప్రకారం కేసులు...

అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. స్మగ్లర్లపై పీడీయాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. అటవీ హక్కుపత్రాలు వస్తాయని అడవులను ఎవరు కొట్టినా నేరమేనని వివరించారు. సాధ్యమైనంత త్వరగా అటవీ ప్రాంతంలోని రాంపూర్​, మైసంపేట గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : 'గిరి' యువతను ఊరిస్తున్న ఉపాధి..

Intro:hyd_tg_05_14_women_murder_pkg_VO_TS10056
Lsnraju:9394450162

నోట్:hyd_tg_11_14_murderwomen_traceout_Vo_TS10056 విజువల్స్ కూడా వాడుకోగలరు

యాంకర్:

Body:కన్న కూతురు ఇంటికి వెళదామని తల్లి ఇంటి నుంచి బయలుదేరింది మార్గమధ్యంలో తాను ఎక్కిన బస్సు చెడిపోయింది తన కూతురికి ఫోన్ చేసి చెప్పింది అటు కూతురు ఇంటికి వెళ్ళాక అదృశ్యమయ్యే చివరకు దుండగుల చేతిలో తన పిల్లలకు విషాదాన్ని మిగిల్చింది పరిధిలో అదృశ్యమైన అంజలి పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో విగతజీవిగా మిగిలింది
వాయిస్ ఓవర్ 1 :మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గ్రామానికి చెందిన అంజిలమ్మ హైదరాబాద్ సన్సిటీ లో ఉంటున్న కూతురు మమత ఇంటికి వెళ్లేందుకు ఈ నెల 12వ తేదీన బయలుదేరింది అదే రోజు సాయంత్రం ఆమె వద్ద తాను ఎక్కిన బస్సు చెడిపోయిందని ఇంకో బస్సు ఎక్కి వస్తానని తన కూతురు ఫోన్ చేసి చెప్పింది అక్కడ నుంచి ఆమె కనిపించకుండా పోయింది అనంతరం కూతురు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్ళింది కూతురు మమత వారు జాప్యం చేయడంతో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఎక్కడ అదృశ్యమైందో అక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తర్వాత రోజు చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు నార్సింగ్, చేవెళ్ల పోలీసులు నిర్లక్ష్యం మూలంగా తాను అమ్మను కోల్పోవలసి వచ్చిందని మమత ఆరోపిస్తుంది
వాయిస్ ఓవర్ 2 చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అంజిలమ్మ చరవాణి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో చివరగా సిగ్నల్ చూపించిందని అనంతరం చరవాణి స్విచాఫ్ అయింది అని పోలీసులు చెబుతున్నారు ఈ కేసు విషయంలో నిబంధనల ప్రకారం ఏం చేయాలో అది చేశామని వారు చెబుతున్నారు
వాయిస్ ఓవర్ 3: చేవెళ్ల లో అదృశ్యమైన అంజిలమ్మ ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం పటాన్చెరు మండలం లక్డారం శివారు నిర్మానుష్య ప్రాంతంలో మెడకు ఉరి బిగించి ఆనవాళ్లతో చనిపోయి కనిపించింది పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇప్పటికే పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి మృతదేహం ఉన్న చోట హెచ్ఐవి మాత్రలు చేవెళ్ల పరిధిలో వేరే వ్యక్తితో ద్విచక్రవాహనం వెళ్లడం సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.అలాగే ఆమె చరవాణి ఆధారంగా అదే సమయంలో ఎవరు ఫోన్ చేశారు ఎవరు వెంబడి వెళ్ళింది అని వివరాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు
ముగింపు వాయిస్ ఓవర్: అదృశ్యం కేసు హత్యకేసు గా మారడంతో పటాన్చెరువు పోలీసులు దీనిపై గట్టి దర్యాప్తు చేస్తున్నారు నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు

Conclusion:బైట్ 1మమత మృతురాలి కూతురు
బైట్ 2 లక్ష్మయ్య మాజీ జెడ్పిటిసి
బైట్ 3 రేణుక చేవెళ్ల ఎస్సై
బైట్ 4 బోస్ మృతురాలి బంధువులు
బైట్ 5 నరేష్ సీఐ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.