ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం నేపథ్యంలో... అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాల సమీపంలోని ప్రజలను నిత్యం కలుస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని జిల్లేడ, వేమనపల్లి, కళ్ళంపల్లి గ్రామాల్లో రైతులు, కూలీలకు అధికారులు అవగాహన కల్పించారు. వ్యవసాయ పనులు చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణపల్లి రేంజర్ గోవిందు, చందు, సర్దార్, డిప్యూటీ రేంజర్ బాబు పటేకర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'నేరచరిత గల నేతల కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం'