ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రూ. 850కి తగ్గిన విద్యుత్ బిల్లు - electricity officers on current bill issue

ఆదిలాబాద్​ జిల్లాలో కరెంట్​ బిల్లుల పొరపాట్లపై ఈనాడు- ఈటీవీ భారత్​ కథనానికి విద్యుత్​ శాఖ అధికారులు స్పందించారు. రూ. 29,838 బిల్లు వచ్చిన వ్యక్తి వివరాలను పరిశీలించి... అతనికి పొరపాటుగా అంత బిల్లు వచ్చినట్లు గుర్తించి.. సగటున వచ్చే రూ. 850 విలువైన కరెంట్​ వాడినట్లు నిర్ధరించారు.

electricity department solved overbilling  problem at adilabad
ఈటీవీభారత్ ఎఫెక్ట్: రూ. 850కి తగ్గిన విద్యుత్ బిల్లు
author img

By

Published : Oct 6, 2020, 8:45 AM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ నమోదులో దొర్లుతున్న తప్పులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గుత్తేదారులు నమోదు చేస్తున్న మీటర్​ రీడింగ్​నూ అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. సంస్థలో టెండర్​ దక్కించుకున్న గుత్తేదారు, విద్యుత్​శాఖ సిబ్బంది నమోదు చేస్తున్న రీడింగ్​ లోపాలపై 'ఈనాడు- ఈటీవీ భారత్​'లో 'లెక్కతప్పుతున్న విద్యుత్ బిల్లు రీడింగ్.. ఆందోళనలో ప్రజలు' శీర్షికన కథనానికి యంత్రాంగం అప్రమత్తమైంది.

తప్పులు చేస్తే ఉపక్రమించేది లేదని స్వయంగా ఆ శాఖ ఎస్ఈ ఉత్తమ్​కుమార్​ జాడే స్పష్టం చేయగా బిల్లింగ్​ నమోదు చేసే సిబ్బందిలో ఆందోళన మొదలైంది. జందాపూర్​ గ్రామానికి చెందిన యువకుడికి స్వయంగా ఫోన్​ చేసిన సిబ్బంది బిల్లులను తెప్పించుకున్నారు. ఎలాంటి పాత బకాయిలు లేని అతనికి రూ.29,838 బిల్లు పొరపాటుగా వచ్చినట్లు గుర్తించి దానిని రూ. 850 బిల్లుగా నిర్ధరించారు. నెలరోజుల నుంచి సిబ్బంది చుట్టూ తిరిగినా స్పందించలేదని.. ఈనాడు- ఈటీవీ భారత్​ కథనంతో సమస్య పరిష్కారమైందని బాధితుడు రాజేశ్​ ఆనందం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.