MP Soyam Bapurao Interview: తెరాస ఆదివాసీ నేతలకు ధైర్యం ఉంటే సీఎం కేసీఆర్‌కు లేఖ ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురుడు పోసుకున్న ఆదివాసీ హక్కుల పోరాట ఉద్యమాన్ని దిల్లీ స్థాయిలో వినిపించడంలో తుడుందెబ్బ రాష్ట్ర సమితి పాత్ర కీలకమైనది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎంపీ సోయం బాపురావు అనూహ్యంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి దాకా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తప్పించాలని నినదించిన ఆయన... ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా భాజపా రాజకీయాలపై దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇటీవల ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేయడం కలకలం రేకెత్తించింది. భాజపా వాదం... ఆదివాసీ నినాదం అని ఈటీవీ-ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ సోయం బాపురావు తెలిపారు.
ఇదీ చదవండి:Revanth Reddy Interview: 'తెరాస శకం ముగిసింది.. రాబోయే శకం కాంగ్రెస్ పార్టీదే'