ETV Bharat / city

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో కొవిడ్‌ మరణం... - corona cases in telangana

కరోనా వైరస్​ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఆదిలాబాద్​ జిల్లాలోనూ రోజురోజుకు పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయి. దాంతో పాటు మరణాల సంఖ్య సైతం ఐదుకు చేరింది. పట్టణ పరిధిలోని అంబేడ్కర్​ కాలనీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు.

another covid death in adilabad
another covid death in adilabad
author img

By

Published : Aug 5, 2020, 1:24 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. జిల్లాలో కొవిడ్‌ బారినపడి మరొకరు మృతి చెందారు. పట్టణ పరిధిలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి 5 రోజుల కిందట కరోనా సోకగా... రిమ్స్‌ ఐసోలేషన్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడం వల్ల అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేశారు.

అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే బాధితుడు కన్నుమూశాడు. ఈ ఘటనతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరుకుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా. నరేందర్‌ రాఠోడ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.