రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు విడనాడాలని.. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిందని, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని, ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూములు పంచే ప్రసక్తేలేదని సర్కారు అనడం అన్యాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విలాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. గిరిజనులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని కోరారు. వైరస్ బారిన పడిన కుటుంబాలకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆ మార్కెట్లో అమ్మకానికి కూలీలు.. కారణం అదే