ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తన దందా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పష్టంచేశారు. రైతులు అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసేలా అధికారులు విస్త్రృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలసి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
రైతులు రసీదులు చూపిస్తేనే పంట వివరాలు నమోదు చేస్తామని అధికారులు తేల్చి చెప్పాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారులు నటరాజ్, డేవిడ్, ఆర్టీవో, డీఎస్పీ, వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.