ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే 29 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో 163 శాంపిళ్లను సేకరించగా అందులో 29 మందికి వైరస్ సోకింది. ఓ వృద్ధురాలు కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
జిల్లాలో ఇప్పటివరకు 260 మంది కరోనా సోకగా.. 75 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 181 మంది బాధితుల్లో 46 మంది రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ముగ్గురు హైదరాబాదులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 132 మంది హో క్వారంటైన్లో ఉన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు