Year End Car Discounts : భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా షోరూమ్ డీలర్ల వద్ద ఉన్న స్టాక్లను క్లియర్ చేసేందుకు అదనపు రాయితీలను కూడా ఇస్తున్నాయి. కొత్త కారు కొనాలని ఆశపడేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఎస్యూవీ కార్లపై అందిస్తున్న బెస్ట్ డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki Car Discounts :
ఇండియాలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకి తమ వాహనాలపై భారీ రాయితీలను అందిస్తోంది. ఇటీవల అది తీసుకొచ్చిన జిమ్నీ థండర్ ఎడిషన్‌పై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు భారీగా అమ్ముడుపోయిన గ్రాండ్ విటారా మోడల్పై రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు రాయితీ కల్పిస్తోంది. ఇక మోస్ట్ పాపులర్ కార్ అయిన ఫ్రాంక్స్‌పై రూ.40,000 వరకు ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్ అందిస్తోంది.
Hyundai Car Discounts :
హ్యుందయ్ కంపెనీ తమ ప్రీమియం ఎస్యూవీ టక్సన్ డీజిల్ వేరియంట్‌పై రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే 7 సీటర్ కార్ అయిన అల్కజార్ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్‌పై రూ.35 వేలు, డీజిల్ వేరియంట్‌పై రూ.20 వేల వరకు రాయితీ ఇస్తోంది.
Tata Car Discounts :
టాటా మోటార్స్ సఫారీ, హారియర్, నెక్సాన్ ఈవీ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందిస్తోంది. వీటిల్లో హారియర్, సఫారీలపై ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. టాటా కంపెనీ పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ అయిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వెర్షన్‌పై రూ.2.6 లక్షలు, ప్రైమ్ ట్రిమ్స్‌పై రూ.1.9 లక్షల వరకు రాయితీ అందిస్తోంది.
Mahindra Car Discounts :
వాహనాల కొనుగోలుపై చాలా అరుదుగా డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల్లో మహీంద్ర ఒకటి. ఇందులో వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువే. అలాంటిది మహీంద్రా కంపెనీ XUV400 EV టాప్ EL ట్రిమ్ మోడల్పై రూ.4.2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో ESC ఫీచర్‌ను కూడా అప్డేట్ చేసింది. EC వేరియంట్‌పై రూ.1.7 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. XUV300 మోడల్ విషయానికి వస్తే, ఆయా వేరియంట్లను అనుసరించి గరిష్ఠంగా రూ.1.72 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది. ఇవే కాకుండా బొలెరో, బొలెరో నియో మోడళ్లపైనా ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా, వరుసగా రూ.96 వేలు, రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
Skoda Car Discounts :
జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ స్కోడా ఫ్లాగ్షిప్ SUV అయిన Kodiaq మోడల్పై రూ.2.66 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. Kushaq మోడళ్లపై ఆయా వేరియంట్‌ను అనుసరించి గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. వీటికి తోడు ఈ రెండు SUVలపై కాంప్లిమెంటరీగా నాలుగేళ్లు లేదా 60 వేల కిలోమీటర్లు వరకు సర్వీసు ప్యాకేజీ అందిస్తోంది.
Volkswagen Car Discounts :
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తమ Taigun మోడల్పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ అన్నీ కలిపి రూ.1.46 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది. తమ ఫ్లాగ్షిప్ SUV అయిన Tiguanపై ఏకంగా రూ.4.2 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కాంప్లిమెంటరీగా 4 ఏళ్ల సర్వీసు ప్యాకేజీ ఇస్తోంది.
Citroen Car Discounts :
సిట్రోయెన్ కంపెనీ MY-2022 మోడల్స్ అయిన C5 Aircoss కార్లపై రూ.3.5 లక్షల రాయితీ అందిస్తోంది. ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తమ లేటెస్ట్ మిడ్‌సైజ్ SUV అయిన C3 Aircrossపై ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
MG Car Discounts :
ఎంజీ మోటార్స్ Gloster, Hector, Astor, ZS EV మోడల్ SUVలపై మంచి డిస్కౌంట్స్ ప్రకటించింది. వీటిల్లో Hector కారుపై రూ.1,00,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇక మిగిలిన Gloster, Astor, ZS EV కార్లపై ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా రూ.1.5 లక్షల వరకు రాయితీ అందిస్తోంది.
సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
రూ.10 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!