ETV Bharat / business

'భారత ఆర్థిక వ్యవస్థ భేష్'.. వృద్ధి రేటు అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్ - india gdp growth forecast 2022 23

భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని నిలబడి, పుంజుకుంటోందని ప్రపంచ బ్యాంక్​ తెలిపింది. అందుకే 2022-23 సంవత్సరంలో భారత్​ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి సవరించినట్లు మంగళవారం వెల్లడించింది.

world bank on indian economy
gdp
author img

By

Published : Dec 6, 2022, 3:50 PM IST

2022-23 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంక్​ మంగళవారం తెలిపింది. అంతర్జాతీయ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడి, పుంజుకుంటూ ఉండడమే ఇందుకు కారణమని వివరించింది.
అక్టోబర్​లో భారత దేశ వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది వరల్డ్​ బ్యాంక్​. ఇప్పుడు 2022-23కు 6.9 శాతానికి పెంచింది.

గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2022-23 జులై- సెప్టెంబర్​లో దేశ జీడీపీ 6.3 శాతం మేర పెరిగింది. అమెరికా, ఐరోపా​, చైనాలోని వేర్వేరు పరిణామాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడలేదని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2022-23లో ద్రవ్య లోటును జీడీపీలో 6.4శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోగలదని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.