ETV Bharat / business

భారత్ వృద్ధి 6.5 శాతమే.. అంచనాలను తగ్గించిన వరల్డ్​ బ్యాంక్​ - GDP growth forecast for India

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన సంస్థల జాబితాలో ప్రపంచ బ్యాంక్​ కూడా చేరింది. వృద్ధిరేటు 7.5 శాతం ఉండొచ్చని గత జూన్‌లో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్‌.. తాజా నివేదికలో 1 శాతం తగ్గించి 6.5 శాతానికి పరిమితం చేసింది.

india gdp
gdp
author img

By

Published : Oct 7, 2022, 8:11 AM IST

Updated : Oct 7, 2022, 9:27 AM IST

India GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన సంస్థల జాబితాలో ప్రపంచ బ్యాంకూ చేరింది. వృద్ధిరేటు 7.5 శాతం ఉండొచ్చని గత జూన్‌లో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్‌.. తాజా నివేదికలో 1 శాతం తగ్గించి 6.5 శాతానికి పరిమితం చేసింది. అయితే దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ బలంగా పుంజుకుంటోందని తెలిపింది. కొవిడ్‌-19 మొదటి దశలో ఆర్థిక వ్యవస్థ గణనీయంగా క్షీణించినా.. తదుపరి బలంగా పుంజుకుని, మెరుగైన పనితీరును కనబరుస్తోందని వరల్డ్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్త (దక్షిణాసియా) హన్స్‌ టిమ్మర్‌ చెప్పారు. ఆయన ప్రకారం..

  • సానుకూలం: విదేశీ రుణాలు మరీ ఎక్కువగా లేకపోవడం, సేవల రంగం ఆకర్షణీయంగా రాణిస్తుండటం, విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, పరపతి విధాన నిర్ణయాలు భారత్‌కు కలిసొస్తున్న అంశాలు.
  • ప్రతికూలం: అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం, కీలక రేట్ల పెంపు వల్ల వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వడ్డీరేట్లను పెంచడం వల్ల పెట్టుబడులు భారమై, ప్రతికూలంగా మారతాయి.
  • భారత్‌ నుంచి గోధుమల ఎగుమతుపై నిషేధం, బియ్యం ఎగుమతిపై అధిక టారిఫ్‌లు విధించడం మిగిలిన ప్రపంచంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
  • భారత్‌లో వృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితం అవుతున్నాయి. అందరికీ అందినప్పుడే ఆర్థిక వ్యవస్థకు మేలు.

Last Updated : Oct 7, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.