ETV Bharat / business

Women Economic Empowerment Tips : మహిళల కోసం స్పెషల్ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్​.. ఇవి పాటిస్తే ఆర్థిక విజయం గ్యారెంటీ!

Women Economic Empowerment Tips In Telugu : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగే దసరా. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా.. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ఇదే శుభసమయం. అందుకే మహిళలు ఆర్థిక విజయం సాధించేందుకు పాటించాల్సిన సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

investment tips for women
Women Economic Empowerment Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 4:46 PM IST

Women Economic Empowerment Tips : మహిళలు అంటే శక్తి స్వరూపాలు. వారికి సహజ సిద్ధంగానే అనేక నైపుణ్యాలు ఉంటాయి. వాస్తవానికి మగవాళ్ల కంటే మహిళలే చాలా చక్కగా ఆర్థిక నిర్వహణ చేయగలుగుతారు. అయితే కొంత మంది మగువలు మాత్రం.. ఆర్థిక వ్యవహారాలను కేవలం మగవాళ్లు చూసుకునే అంశంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఆధునిక సమాజంలో మహిళలకు కూడా కచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందే. అందుకే మహిళలు తమ ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకునేందుకు పాటించాల్సిన కీలక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన ప్రణాళికతో పెట్టుబడులు!
పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంలా లాభ, నష్టాలను అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా స్టాక్​మార్కెట్ పెట్టుబడుల విషయంలో సహనం పాటించాలి. అలాగే ఈక్విటీ పెట్టుబడుల్లో వచ్చే రాబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి, నష్టాన్ని భరించే శక్తి సహా, మీ ఆకాంక్షలకు అనుగుణంగా సరైన ప్రణాళిక వేసుకొని, అందుకనుగుణంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. కొంతమంది మగువలు.. తమ స్నేహితులు, బంధువులు చెప్పిన మాటలు విని తమకు ఏమాత్రం అవగాహన లేని పథకాల్లో పెట్టుబడులు పెడతారు. తీరా నష్టపోయి తర్వాత ఇతరులను నిందిస్తూ కూర్చుంటారు. ఇది సరైన విధానం కాదు.

భావోద్వేగాలను కంట్రోల్​ చేసుకోవాలి!
మీకు తెలియని, అవగాహన లేని పెట్టుబడి మార్గాల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. అలాగే పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో చాలా ఆన్​లోన్​ లోన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ట్రాప్​లో మీరు పడకుండా జాగ్రత్త పడాలి. స్వల్పకాలంలోనే భారీ లాభాలు ఇస్తామని చెప్పేవారిని అస్సలు నమ్మవద్దు. ఇందుకోసం మీరు స్వయంగా ఆర్థిక పరిజ్ఞానం పెంచుకోవాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి!
How To Create Emergency Fund : నేటి కాలంలో ఎప్పుడు ఏం అవుతుందో, ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేకపోతున్నాం. అందుకే కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, రుణ వాయిదాలు, ఇతర అవసరాలను ఒకసారి కచ్చితంగా లెక్కించుకోవాలి. సులువుగా నగదుగా మార్చుకునే పథకాల్లో కొంత మొత్తం పెట్టుబడిపెట్టాలి. ఇవి అవసర సమయాల్లో అక్కరకు వస్తాయి.

బీమా పాలసీలు ఉండాల్సిందే!
Best Life Insurance Policies For Women : స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ బీమా పాలసీలు ఉండాల్సిందే. ఉద్యోగం చేస్తున్నవారికే కాదు. గృహిణులకు కూడా కచ్చితంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉండితీరాలి. ఇవి అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాయి. అత్యవసర నిధి వేరు.. జీవిత బీమా, ఆరోగ్య బీమా వేరు అనే విషయాన్ని చాలా క్లియర్​గా తెలుసుకోండి.

దీర్ఘకాలిక పెట్టుబడులు!
అత్యవసర నిధి, బీమా అవసరాలు తీరిన తరువాత భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టుకోవాలి. ఇందుకోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక పొదుపు, మదుపు పథకాలను ఎంచుకోవాలి. షేర్​ మార్కెట్ విషయానికి వస్తే దీర్ఘకాల పెట్టుబడులకు ప్లాన్ చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.

పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయాలి!
Portfolio Management Tips : మీ మొత్తం సొమ్మును ఒకే పథకంలో పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. అందుకే మీ సొమ్మును వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించాలి. సింపుల్​గా చెప్పాలంటే మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయాలి. షేర్స్​, మ్యూచువల్ ఫండ్స్​, బంగారం, ఫిక్స్​డ్ డిపాజిట్స్​, రియల్​ ఎస్టేట్​, డెట్​ ఫండ్స్ ఇలా విభిన్నమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే దీర్ఘకాలంలో మీకు మంచి సంపద చేకూరుతుంది.

భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకోవాలి!
ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టాలి. ఇవి మీ జీవిత చరమాంకంలో లేదా రిటైర్ అయిన తరువాత కచ్చితంగా ఉపయోగపడతాయి. భవిష్యత్​లో దేశంలోని రాజకీయ అనిశ్చితి, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం ఇలా ఎన్నో అంశాలు మీ పెట్టుబడులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వీటన్నింటినీ తట్టుకుంటూ స్థిరంగా మీ ఆదాయం వృద్ధి చెందేలా ప్లాన్ చేసుకోవాలి.

పొరపాట్లు సరిదిద్దుకోవాలి!
పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వీలైనంత వరకు పొదుపు పెంచుకోవాలి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు.. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. అవసరమైతే మీ పెట్టుబడుల్లో సరైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి.

నిపుణుల సలహా తీసుకోవాలి!
మీకు ఆర్థిక విషయాల్లో సరైన అవగాహన లేకపోతే.. అందుకు చింతించాల్సిన పనిలేదు. నేడు పలు బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు మహిళల కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్​లైన్​లోనూ ఆర్థిక నిపుణుల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని గుడ్డిగా నమ్మకూడదు. ఉచిత సలహాల విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా అన్ని విషయాలను చెక్​ చేసుకుని.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. ఈ సూత్రాలు అన్నీ కచ్చితంగా పాటిస్తే చాలు.. ఆర్థికంగా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆల్​ ది బెస్ట్!

Home Loan Subsidy Schemes : సొంత ఇళ్లు కట్టుకోవాలా?.. తక్కువ వడ్డీకే రుణాలు సహా.. సబ్సిడీ ఇచ్చే బెస్ట్ స్కీమ్స్ ఇవే!

Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్ న్యూస్​.. ఈజీగా రూ.15,000 వరకు లోన్​.. ఈఎంఐ నెలకు రూ.111 మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.