ETV Bharat / business

ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మంచిది? - సేవింగ్స్ అకౌంట్

Which Bank is Better for Savings Account : బ్యాంకు అకౌంట్లలో కరెంట్ అకౌంట్.. సేవింగ్స్ అకౌంట్ ఉంటాయని తెలుసు. కానీ.. సేవింగ్స్ అకౌంట్​ ప్రయోజనాలు బ్యాంకును బట్టి మారుతుంటాయని మీకు తెలుసా? ఈ స్టోరీలో.. ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.

Which Bank is Better for Savings Account

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 11:29 AM IST

Public Vs Private Which Bank Better for Savings Account : ప్రస్తుతం ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థ‌కాల నుంచి.. చాలా వ‌ర‌కు ఆర్థిక‌ లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అనివార్యమవుతోంది. దీంతో.. అందరూ పొదుపు ఖాతా(Savings Account). ఓపెన్ చేస్తున్నారు. అయితే.. ఏ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయడం బెటర్? ఎక్కడ మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు? అనే విషయాలు చాలా మందికి తెలియదు. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు, ఇతర ఫీచర్లను ఓసారి పోల్చి చూసుకోవడంతోపాటు మరికొన్ని వివరాలను పరిశీలించడం ద్వారా.. ఏ బ్యాంకులో పొదుపు ఖాతా ఉత్తమం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

వడ్డీ రేటు : ఎవరైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు.. ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఓసారి పోల్చి చూసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఇది దీర్ఘకాలంలో పెద్ద అంశం కావచ్చు.

మినిమమ్ బ్యాలెన్స్ : చాలా బ్యాంకుల్లో.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కనీసం రూ. 500 నుంచి గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు ఉండవచ్చు. అయితే.. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్​ ఇస్తాయి. అంటే వీటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. వినియోగదారులు తమ అభిరుచి మేరకు ఈ ఖాతాను ఎంచుకోవచ్చు.

నగదు విత్​డ్రా : చాలా సేవింగ్స్ బ్యాంకులకు నెలవారీ విత్​డ్రాలో పరిమితులు ఉన్నాయి. ఒక నెలలో అకౌంట్ నుంచి ఎన్ని సార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు? అనే దానికి లిమిట్ ఉంటుంది. అందువల్ల.. ఎలాంటి రుసుము లేకుండా ఎక్కువ సార్లు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే పొదుపు ఖాతాను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రుసుములు, ఛార్జీలు : సేవింగ్స్ అకౌంట్స్​కు నెలవారీ రుసుము, క్రాస్-కరెన్సీ మార్క్-అప్, పిన్ రీ-జెనరేషన్ రుసుము.. ఇలా మొదలైన వివిధ రుసుములు ఉంటాయి. అలాగే అకౌంట్ నిర్వహణ రుసుము కూడా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతీ సంవత్సరం ఈ అమౌంట్ కస్టమర్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఈ నేపథ్యంలో.. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రధాన బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్​ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Higher Interest for Women on Fixed Deposit : ఈ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో.. మహిళల పెట్టుబడికి అధిక వడ్డీ..!

SBI సేవింగ్స్ అకౌంట్ : ఎస్​బీఐ ఖాతాలో.. రూ.10 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్‌కు ఏడాదికి 2.70 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే.. 3.00 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ : ఇందులో రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్‌పై 3% వడ్డీ వస్తుంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌ ఉంటే 3.50 శాతం మేర వడ్డీ లభిస్తుంది.

కోటక్ మహీంద్రా పొదుపు ఖాతా : ఈ ఖాతాలో రూ.50 లక్షల లోపు నిల్వలపై 3.50 శాతం, అలాగే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.

యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతా : ఈ బ్యాంకులో వడ్డీ రేటు రూ.50 లక్షల కంటే తక్కువ నిల్వలకు 3.00 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 3.50 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ : దీనిలో రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వార్షిక వడ్డీ 3.00 శాతం.. అదే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే 3.50 శాతం లభిస్తుంది.

DCB బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ : ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు ఏడాదికి 2.50 శాతం నుంచి 5.00 శాతం వరకు ఉంటాయి.

RBL బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ : ఇందులో వార్షిక వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది.

Note : బ్యాంకుల నిర్ణయాలు మారొచ్చు. అప్పుడు వడ్డీ రేట్లలో తేడాలు రావొచ్చు. అందువల్ల.. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఈ వడ్డీ రేట్లను సమీక్షించుకోవడం మంచిది.

What Happens to Your Money in Bank Accounts After Death : మీకు ఇది తెలుసా..? చనిపోయాక బ్యాంకులో డబ్బు ఎక్కడికి పోతుందో..!

Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.