ETV Bharat / business

సమ్మర్ కోసం 'కూలర్'​ కొనాలా? ఈ ఫీచర్స్ తప్పక ఉండేలా చూసుకోండి!

మార్చి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఏసీలు కొనలేని చాలా మంది మధ్యతరగతి ప్రజలు.. వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎయిర్ కూలర్లు కొంటుంటారు. అయితే చాలా మందికి ఎలాంటి ఎయిర్ కూలర్లు కొనాలో తెలియక రకరకాల కూలర్లు కొంటుంటారు. వీటితో ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడతుంటారు. అసలు ఎయిర్ కూలర్లు కొనేముందు ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకుంటే మన పని సులభం అవుతుంది. మరి ఆ అంశాలేంటో తెలుసుకుందామా!

which air cooler is best for home use
which air cooler is best for home use
author img

By

Published : Mar 15, 2023, 4:15 PM IST

వేసవి కాలం వచ్చిందటే చాలు.. ఎండలు మండిపోతాయి. ఆ గాలి వేడికి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేం. దీంతో ప్రజలంతా చల్లదనం కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. దీనిలో భాగంగా ఎక్కువ మంది ఎయిర్​ కూలర్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే ఏసీ పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కూలర్ల మెయింటెనెన్స్ కూడా సులభం. అందుకే చాలా మంది ఎయిర్​ కూలర్లు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే చల్లదనాన్ని అందించే ఈ ఎయిర్​ కూలర్లు కొనే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. మన అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే వాటిని ఎంచుకోవాలి. మరి వాటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందామా..!

వాటర్ ట్యాంక్ కెపాసిటీ
సాధారణంగా ఎయిర్​ కూలర్లు నీటితో పనిచేస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కూలర్లు పనితీరు అనేది దాని నీటి ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఎక్కువ నీటి కెపాసిటీ ఉన్న ఎయిర్​ కూలర్లు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాటర్​ ట్యాంక్​ పెద్దగా ఉంటే కూలర్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. అయితే ఇంట్లో పెద్ద గదులు ఉన్నవారు.. దాదాపు 30 నుంచి 50 లీటర్లు కెపాసిటీ ఉన్న ట్యాంకులను ఎంచుకోవాలి. అదే చిన్న రూమ్ ఉన్నవారు అయితే.. 20 నుంచి 30 లీటర్ల కెపాసిటీ ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. ఇలా పెద్ద వాటర్​ ట్యాంక్ ఉన్నవి తీసుకుంటే.. ప్రతిసారి లేచి అందులో నీటిని నింపాల్సిన పని ఉండదు.

గాలి ప్రవాహం..
గది పరిమాణానికి సరిపడే ఎయిర్​ కూలర్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అసలు దీని గురించి తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే.. ఎయిర్​ కూలర్ల నుంచి వీచే​ గాలి ప్రవాహాన్ని 'క్యూబిక్​ ఫీట్​ ఫర్​ మినిట్​(CFM)'లలో కొలుస్తారు. ప్రతి నిమిషానికి గదిలో ఎంత గాలి వీస్తుందో అన్న విషయాన్ని ఈ CFM తెలియజేస్తుంది. CFMని బట్టి ఎయిర్ కూలర్​ సైజ్​ను మనం ఎంచుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న గది పరిమాణం ఆధారంగా.. ఎక్కువ CFM ఉండే ఎయిర్​ కూలర్​ను ఎంచుకోవాలి.

కూలింగ్​ ప్యాడ్స్​
ఎయిర్​ కూలర్​లో ఉండే కూలింగ్​ ప్యాడ్స్​ ఆధారంగా గాలి చల్లదనం ఆధారపడుతుంది. ఈ కూలింగ్​ ప్యాడ్స్ నీటిని పీల్చుకుంటే.. తర్వాత చల్లని గాలి బయటకు వస్తుంది. కాబట్టి చెక్క, సింథటిక్ ఫైబర్​తో తయారైన​ కూలింగ్​ ప్యాడ్స్​ కంటే.. తెనేటీగ గూడులా ఉండే ఆస్పెన్​ ప్యాడ్​లను ఎంచుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్​ నుంచి బయటకు వచ్చే గాలి కంటే.. ఈ ఆస్పెన్​ ప్యాడ్​ల నుంచి బయటకు వచ్చే గాలి ప్రవాహమే మంచిది. ఈ ప్యాడ్స్​ కొంచెం ఖరీదుతో కూడుకున్నా సరే ఇవి ఉన్న ఎయిర్​ కూలర్లనే కొనుగోలు చేయడం ఉత్తమం.

ఇన్వర్టర్​పై పనిచేసేలా..
ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా రకరకాల ఫీచర్లున్న ఎయిర్​ కూలర్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా ఇన్వర్టర్​లపై పనిచేసే కూలర్లు కూడా ఉన్నాయి. వీటికి కొనుక్కుంటే కరెంట్ లేకపోయినా సరే.. ఇన్వర్టర్​ల ఆధారంగా పనిచేస్తాయి. దీంతో పాటుగా తక్కువ విద్యుత్​ను వినియోగించుకుంటాయి. కాబట్టి మీరు కొనుగోలు చేసే ఎయిర్ కూలర్ ఇన్వర్టర్​పై పనిచేసేది అవునో కాదో చెక్​ చేసుకోవాలి.

రిమోట్​ కంట్రోల్​ ఉంటే ఇంకా బెటర్​
ఎయిర్​ కూలర్లో ఉండే సెట్టింగులను సులభంగా మార్చుకునేందుకు ప్రస్తుతం రిమోట్ కంట్రోల్​ కూలర్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. వీటిని కొనుక్కుంటే.. గాలి వేగాన్ని రిమోట్​ ద్వారా సింపుల్​గా మార్చుకోవచ్చు. లేదంటే కూర్చున్న చోట నుంచి పైకి లేచి.. మార్చుకోవాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.