What Is Freedom SIP : మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP) గుర్తొస్తాయి. ఒక క్రమపద్ధతిలో మదుపు చేస్తూ.. దీర్ఘకాలంలో మంచి కార్పస్ పొందాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సిప్ విధానంలో.. మనకు నచ్చినంత, వీలైనంత సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే మనకు అవసరమైనప్పుడు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది SIP విధానాన్ని ఎంచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఫ్రీడమ్ సిప్ గురించి విన్నారా? అసలు ఫ్రీడమ్ సిప్ అంటే ఏమిటి? సాధారణ SIPకు, ఫ్రీడమ్ సిప్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Freedom SIP Benefits : ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్రీడమ్ సిప్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఇది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) + సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP)ల సమ్మేళనం అని చెప్పవచ్చు.
సిప్ విధానం : మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ముందుగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకు 8 ఏళ్లు/ 10 ఏళ్లు/ 12 ఏళ్లు /15 ఏళ్లు.. ఇలా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఎంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక పద్ధతి ప్రకారం, నిర్దిష్ట మొత్తాలను మదుపు చేస్తూ ఉండాలి. మీరు అనుకున్న టెన్యూర్ పూర్తి అయిన తరువాత మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇదే SIP విధానం. అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్లు.. దీనికి సిస్టమేటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌ను జత చేశారు.
సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ : మ్యూచువల్ ఫండ్ టెన్యూర్ పూర్తైన తరువాత మీరు ఒకేసారి లప్సమ్ అమౌంట్‌ను తీసుకోకుండా.. మ్యూచువల్ ఫండ్ డబ్బులను అలాగే ఉంచుతారు. అయితే మీ అవసరాలకు అనుగుణంగా నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. దీనినే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అంటారు. మిగిలిన డబ్బులను ఒక టార్గెట్ స్కీమ్‌లో మరలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బుపై మరలా రాబడి వస్తుంది. అంటే మీ డబ్బులే.. మరలా మీకు డబ్బులను సృష్టిస్తూ ఉంటాయన్నమాట. దీనిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.
Mutual Fund Source Plan And Target Plan : ఐసీఐసీఐ బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం.. మీరు 8 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ టెన్యూర్ అయిన తరువాత, మీరు నెలవారీగా రూ.10,000 చొప్పున SWP చేసుకోవచ్చు. ఒక వేళ మీ సిప్ టెన్యూర్‌ను 10 ఏళ్ల వరకు పొడిగిస్తే.. మీ నెలవారీ SWP మొత్తం రూ. 15,000కు పెరుగుతుంది. ఇదే ఫార్ములాను 30 ఏళ్ల వరకు కొనసాగిస్తే మీకు ప్రతి నెలా రూ.1.20 లక్షలు వరకు అందుతుంది. వాస్తవానికి ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేసింది. అందుకే కాల వ్యవధి పెరుగిన కొలదీ.. మీ ఆదాయం కూడా బాగా పెరుగుతూ వచ్చింది.
నోట్ : ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. SIP చేస్తున్నంత కాలం మీరు కట్టిన డబ్బులు సోర్స్ ప్లాన్‌లో ఉంటాయి. సిప్ టెన్యూర్ పూర్తి అయ్యి.. SWP ప్రారంభం అయిన తరువాత.. ఆ డబ్బులు మీరు కోరుకున్న టార్గెట్ ప్లాన్‌లో జమ అవుతాయి. అయితే సోర్స్, టార్గెట్ స్కీములు రెండూ ఒక్కటే అయ్యుండడానికి వీలుపడదు.
RBI MPC Meeting Updates : వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. మీ EMIపై ప్రభావం ఎంతంటే?