Why is Nominee Mandatory for Bank Accounts in Telugu : మనం నిత్యం జరిపే ఆర్థిక లావాదేవీలన్నింటికీ బ్యాంకు అకౌంట్ కీలకం. వచ్చే ఆదాయం, చేసే ఖర్చులు.. అన్నిటికీ ఈ పొదుపు ఖాతా అవసరమే. ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పింఛను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. అన్నీ మనం ఎంచుకున్న సేవింగ్ అకౌంట్(Saving Account)కే చేరతాయి. అదే విధంగా.. బిల్లులు చెల్లించాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా దాని నుంచే చేస్తుంటాము. అందుచేత ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ పొదుపు ఖాతా ఉండడం అవసరం. అయితే సేవింగ్స్ అకౌంట్ ఎంత ఇంపార్టెంటో.. ఆ అకౌంట్‌కు నామినీని(Nominee)ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
Why is Nominee Important for Bank Accounts : కానీ ప్రస్తుత తీరిక లేని జీవన విధానంలో ఆస్తుల ప్రణాళిక రూపొందించుకోవడంలో విఫలమవుతున్న వారు చాలా మందే ఉన్నారు. బిజీగా జీవితాన్ని గడుపుతూ భవిష్యత్తును విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో. ఖాతదారుడు/మీరు అనుకోకుండా చనిపోతే అకౌంట్లలోని డబ్బు గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మంది కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఆ ఏం అవుతుందిలే.. తర్వాత ఆలోచిద్దాం అని అప్పటికి ఆ విషయాన్ని వదిలేస్తారు.
ఒకవేళ అనుకోకుండా సంభవించే ఘటనల వల్ల ఏదైనా జరిగితే.. ఆ నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లేదా వారసులు భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే నామినీ(Nominee) గురించి కచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ స్టోరీలో మేము తెలియజేస్తున్నాము. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే..
మరణం తర్వాత డబ్బు ఏం అవుతుంది..? (What happens to money after death?) : ఖాతాదారుడు మరణించినప్పుడు.. బ్యాంక్ అన్ని వివరాలను పరిశీలించి.. ఆ తర్వాత అకౌంట్లోని డబ్బులు ఎంచుకున్న నామినీకి బదిలీ చేస్తారు.
నామినీలను అర్థం చేసుకోవడం(Understanding Nominees) : నామినీలు అంటే ఖాతాదారుడు మరణించిన సందర్భంలో అకౌంట్ లేదా FD బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేయడానికి ఎంచుకున్న వ్యక్తులు. అందుకే బ్యాంక్ ఖాతా లేదా FDని తెరిచేటప్పుడు నామినీని పేర్కొనమని అడుగుతారు.
నామినీని ఎంచుకోవడం(Choosing a Nominee) : బ్యాంక్ అకౌంట్-ఓపెనింగ్ ఫారమ్‌ను పూరిస్తున్నప్పుడు మీరు నామినీ వివరాల కోసం ఒక విభాగాన్ని కనుగొంటారు. కుటుంబ సభ్యుడు, జీవిత భాగస్వామి, బిడ్డ, తోబుట్టువు, స్నేహితుడు లేదా బంధువు.. ఇలా మీరు విశ్వసనీయ వ్యక్తిని ఎంచుకోవచ్చు. అలాగే మైనర్ నామినీ కోసం, వారి తరఫున నిధులను యాక్సెస్ చేయగల సంరక్షకుడిని నియమించుకోవాల్సి ఉంటుంది.
జాయింట్ ఖాతాలకు నామినీలు (Joint Accounts and Nominees) : ఉమ్మడి ఖాతాల విషయంలో నామినీ ఎంపికకు ఖాతాదారులందరి సమ్మతి అవసరం. ఉమ్మడి ఖాతాలో నామినీని యాడ్ చేయాలి లేదా తీసివేయాలనుకుంటే అన్ని డిపాజిట్ హోల్డర్ల నుంచి ఒప్పందం అవసరం.
నామినీ మార్పులు (Nominee Changes) : నామినీ మార్పులపై ఎటువంటి పరిమితులు లేకుండా.. అవసరమైనంత తరచుగా వారిని సవరించుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు.
నామినీ అవసరం (The Necessity of a Nominee) : సేవింగ్స్ ఖాతాను తెరిచేటప్పుడు నామినీని నియమించడం తప్పనిసరి. ఇది కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుతుంది. నామినీని నియమించడంలో విఫలమైతే ఖాతాదారు మరణించిన తర్వాత ఫండ్ బదిలీలు క్లిష్టతరం అవ్వొచ్చు.
నామినీ వివరాలను తనిఖీ చేయడం (Checking Nominee Details) : మీరు మీ బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం ద్వారా మీ నామినీ పేరును ధృవీకరించవచ్చు.
నామినీలను తర్వాత యాడ్ చేసుకోవచ్చు (Adding Nominees Later) :
- సేవింగ్స్ ఖాతా కోసం నామినీలను జోడించడానికి లేదా సవరించడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఎంపిక ఉంది.
- మీరు అకౌంట్‌కి లాగిన్ అయిన తర్వాత పొదుపు ఖాతా బ్యాలెన్స్ విభాగానికి నావిగేట్ అవ్వాలి.
- ఆ తర్వాత అకౌంట్ సమ్మరీ పేజీని యాక్సెస్ చేయాలి.
- అలాగే నామినీ సమాచారాన్ని యాడ్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి నామినీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఇలా మీ బ్యాంక్ ఖాతా కోసం నామినీని నిర్ధారించడం వలన మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందుతుంది.
- అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఫండ్ బదిలీలను సులభతరం చేస్తుంది.