Follow These Rules Before Investing in Stock Markets: చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే ఎక్కువ మొత్తంలో జనాలు ఎంచుకునేది స్టాక్ మార్కెట్. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అయితే అది అందరికీ సాధ్యం కాదు. మరి అలాంటి వారు ఏమి చేయాలి..? స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి. అవి ఏంటంటే..?
What are the Rules Before Investing in Stock Markets: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించొచ్చు. ఇది నిజమే. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. షేర్ మార్కెట్‌లో సంపాదించాలని భావిస్తే ముందుగా కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. ఇందులో మొదటిది మీకు రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వేగంగానే నష్టాలు రావొచ్చు. రాంగ్ స్టాక్‌ను ఎంచుకుంటే పెట్టిన డబ్బు పోగొట్టుకోకతప్పదు.
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా, నిజాయితీ కలిగిన ప్రమోటర్స్‌ను చూడాలి.
అలాగే, ప్రమోటర్ తెలివిగా కేటాయించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గత దశాబ్ద కాలంలో లేదా అంతకుమించిన సమయంలో ప్రమోటర్ మూలధనాన్ని తెలివిగా కేటాయిస్తున్నాడా లేదా చూడాలి. మూడో విషయం ఏమంటే మార్కెట్లో ప్రాబల్యం కలిగిన వాటిని చూడాలి. ఇన్వెస్టర్ ఎవరు కూడా సాధ్యమైనంత వరకు విడిచిపెట్టని వాటిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. క్రమశిక్షణ, సహనం కావాలి.
Best Investment Plan : పదవీ విరమణ నాటికి రూ.10 కోట్లు సంపాదించాలా?.. ఇలా ఇన్వెస్ట్ చేయండి!
కరోనాకు ముందు, కరోనా తర్వాత, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు, సంక్షోభం తర్వాత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడానికి ముందు, పెంచిన తర్వాత... ఇలా అన్ని వాతావరణాలలో మంచి ప్రదర్శన కనబరిచే కంపెనీని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఒక మంచి స్టాక్‌ను ఎంచుకున్న తర్వాత స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడొద్దు. కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండి, మార్కెట్ వాటా పెంచుకుంటూ వెళ్తొన్న కంపెనీలపై నమ్మకంగా ఉండొచ్చు.
సామర్థ్యం ఉన్న స్టాక్ సత్తా తెలియాలంటే కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు హఠాత్తుగా స్టాక్ పెరిగితే మంచి రిటర్న్స్ రావొచ్చు. కానీ స్టాక్స్‌లో పెట్టుబడికి ఓపిక అవసరం. మూడేళ్లు కనీసం వేచి చూడాలి. అప్పుడు మంచి రిటర్న్స్ రావొచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్ కన్నా ఎక్కువ రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు మరేవి లేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.