ETV Bharat / business

UPI ట్రాన్సాక్షన్స్‌ లిమిట్‌ - ఫోన్​పే, జీపేలో అలా - పేటీఎంలో ఇలా! - UPI Transactions Daily Limit in google pay

UPI Transactions Daily Limit Details in Telugu: ఇప్పుడు ఎక్కడ చూసినా.. UPI పేమెంట్స్​ హవా కనపడుతోంది. అయితే.. యూపీఐ యాప్స్ ద్వారా నిర్వహించే లావాదేవీలపై పరిమితి ఉందని మీకు తెలుసా? ఆ పరిమితి కూడా యాప్​ను బట్టి మారుతుందని మీకు తెలుసా?? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

UPI Transactions Daily Limit Details
UPI Transactions Daily Limit Details
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 2:42 PM IST

UPI Transactions Daily Limit Full Details in Telugu: ప్రస్తుతం దేశంలో డిజిటల్​ ట్రాన్సాక్షన్​ హవా కొనసాగుతోంది. ఇండియాలో ఎక్కువ మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా పేమెంట్స్‌ చేస్తున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి వివిధ యాప్‌ల ద్వారా వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. రోజులో ఎన్నిసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనే విషయంలో "లిమిట్‌" ఉందని మీకు తెలుసా? అది కూడా యాప్​ను బట్టి మారుతోందని తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ ఐడీలు పనిచేయవు! కారణం ఏంటంటే ?

గరిష్ఠంగా రూ.లక్ష ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం.. ఒక కస్టమర్​ ఒక రోజులో UPI ద్వారా లక్ష రూపాయలు వరకు ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు. అంతకు మించి ఎక్కువ డబ్బును ఒక రోజులో ట్రాన్స్​ఫర్ చేయలేరు. ఈ నిబంధన.. ఆయా బ్యాంకులు, యాప్‌లపై కూడా ఆధారపడి ఉంటుందని గమనించాలి. అయితే.. 24 గంటల్లో రూ.లక్ష కంటే ఎక్కువ UPI పేమెంట్‌ను ప్రస్తుతం ఏ బ్యాంకూ అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో.. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే యాప్‌ల అమౌంట్​ లిమిట్‌, ఇంకా ట్రాన్సాక్షన్స్‌ లిమిట్‌ గురించి తెలుసుకుందాం.

BHIM - UPI మధ్య తేడాలేంటి? ఏది వాడితే బెటర్?

గూగుల్‌ పే(Google Pay): గూగుల్‌ పే UPI ద్వారా రోజులో రూ.లక్ష కంటే ఎక్కువ పంపలేరు. అదే విధంగా ఒక రోజులో 10 సార్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే ఒక రోజులో గరిష్ఠంగా రూ.లక్ష పంపగలరు, పదిసార్లు మాత్రమే ట్రాన్సాక్షన్‌ చేయగలరు.

ఫోన్‌పే(PhonePe): ఫోన్‌పే కూడా అమౌంట్​ విషయంలో ఇదే లిమిట్ పెట్టింది. రోజులో రూ.లక్ష మాత్రమే పంపగలరు. అయితే.. ఈ యాప్‌లో ట్రాన్సాక్షన్స్ విషయంలో లిమిట్‌ లేదు. అంటే.. గూగుల్ పే మాదిరిగా రోజులో పదిసార్లు మాత్రమే డబ్బు పంపగలరనే నిబంధన ఏదీ లేదు. రూ.లక్ష దాటకుండా రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్​ అయినా చేసుకోవచ్చు.

ఆధార్​ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!!

అమెజాన్​ పే(Amazon Pay): అమెజాన్‌ పే యూపీఐ ద్వారా కూడా.. ఒక రోజులో లక్ష రూపాయల వరకు పేమెంట్స్‌ చేయవచ్చు. అయితే.. ఎన్నిసార్లు లావాదేవీలు నిర్వహించవచ్చు అనే విషయంలో ఒక తేడా ఉంది. ఈ యాప్ ద్వారా ఒక రోజులో 20 లావాదేవీల వరకూ చేసుకోవచ్చు. అంతేకాదు.. న్యూ కస్టమర్స్​ మొదటి 24 గంటల్లో.. కేవలం 5వేల రూపాయలే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు.

పేటీఎం(Paytm): పేటీఎం నుంచి కూడా రోజుకు లక్ష రూపాయలు మాత్రమే పంపగలరు. అయితే.. UPI ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. లక్ష రూపాయలు దాటకుండా.. రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్​ అయినా చేయవచ్చు.

How to Transfer Money With SBI UPI Pay App : మీరు 'ఎస్​బీఐ పే యాప్' వాడుతున్నారా..?

How to Enable AutoPay Feature in UPI Apps : మీ ఫోన్​లో 'AutoPay'ను ఇలా సెట్ చేసి.. మంత్లీ బిల్లులు ఈజీగా చెల్లించండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.