ETV Bharat / business

సేఫ్​గా UPI పేమెంట్స్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే! - యూపీఐ సెక్యూరిటీ టిప్స్​

UPI Security Tips In Telugu : మీరు తరచూ యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే! నేడు ఆన్​లైన్​ ఫైనాన్సియల్ స్కామ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే స్కామర్ల చేతికి చిక్కకుండా, సురక్షితంగా యూపీఐ పేమెంట్స్​, ఆన్​లైన్ పేమెంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips for Safe and Secure UPI Transactions
UPI Security tips
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 5:03 PM IST

UPI Security Tips : టెక్నాలజీ అందుబాటులో వచ్చిన తరువాత ఆన్​లైన్​ పేమెంట్స్​, యూపీఐ ట్రాన్సాక్షన్స్​ విపరీతంగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఆన్​లైన్​ ఫ్రాడ్​లు, స్కామ్​లు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో హ్యాకర్ల చేతికి చిక్కకుండా, సురక్షితంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు పాటించాల్సిన టాప్​-7 టిప్స్ గురించి తెలుసుకుందాం.

యూపీఐ పిన్​ సీక్రెట్​గా ఉండాలి
యూపీఐ పిన్​ అనేది మీ బ్యాంక్​ అకౌంట్​కు ఒక తాళం చెవిలాంటిది. అందుకే దానిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. దీనిని కేవలం బ్యాంకింగ్ యాప్​లోని ఎంట్రీ పేజ్​లో మాత్రమే ఎంటర్​ చేయాలి. గుర్తించుకోండి - కస్టమర్​ సపోర్ట్​ వారికి కూడా మీ పిన్​ను చెప్పకూడదు. ఎందుకంటే, కస్టమర్ సపోర్ట్​ వారికి మీ యూపీఐ పిన్​తో పని ఉండదు.

పేమెంట్ చేసేముందు చెక్ చేసుకోవాలి
మీరు ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పంపించాలని అనుకుంటే, కచ్చితంగా రెసిపెంట్​ పేరును చెక్​ చేసుకోవాలి. ఎందుకంటే, పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తే, వాటిని వెనక్కు తీసుకోవడం కష్టమవుతుంది.

యూపీఐ పిన్ పేజ్​లో మాత్రమే ఎంటర్ చేయాలి
మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని యూపీఐ యాప్​ల్లోనూ 'యూపీఐ పిన్ ఎంట్రీ పేజ్'​ ఒకేలా ఉంటుంది. సురక్షితంగా యూపీఐ పేమెంట్స్​ చేసేందుకుగాను ఎన్​పీసీఐ ఈ సెక్యూర్​ గేట్​వేను రూపొందించింది. కనుక ఈ ఎంట్రీ పేజ్​లోనే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. స్కామర్లు యూజర్లను తప్పుదోవ పట్టించడానికి ఫిషింగ్ లింక్స్​ను పంపిస్తుంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసినా, వాటిలో మీ యూపీఐ పిన్​ను ఎంటర్ చేయకూడదు.

అనధికారిక యాప్​లను డౌన్​లోడ్​​ చేయకూడదు
అనధికారిక యాప్​లను, ఇతరులు షేర్ చేసిన యాప్​లను, ఎస్​ఎంఎస్ ఫార్వార్డ్ యాప్​లను డౌన్​లోడ్​ చేసుకోకూడదు. అలాగే థర్డ్ పార్టీ సాఫ్ట్​వేర్​లను కూడా ఫోన్లో ఇన్​స్టాల్ చేసుకోకూడదు. దీని వల్ల ఫోన్ సెక్యూరిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనితో స్కామర్లు డివైజ్​లోని మన వ్యక్తిగత సమాచారాన్ని, ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్​ను చేజిక్కించుకుంటారు. ఫలితంగా మనం ఆర్థికంగా నష్టపోతాం. కనుక ఆఫీషియల్​ స్టోర్ నుంచి మాత్రమే ఒరిజినల్ యాప్​లను డౌన్​లోడ్ చేసి, ఇన్​స్టాల్ చేసుకోవాలి.

సెక్యూర్​ నెట్​వర్క్​నే వాడాలి
ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు పబ్లిక్ వైఫై వాడకూడదు. ఎందుకంటే, హ్యాకర్లు వీటిని సులువుగా హ్యాక్ చేయగలుగుతారు. అందుకే మీ మొబైల్ డేటాను, హోమ్​ వైఫైని మాత్రమే వాడడం మంచిది.

ఆర్థిక లావాదేవీలను చెక్ చేసుకోవాలి
మీరు చేసే యూపీఐ పేమెంట్స్​ను రెగ్యులర్​గా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం పేమెంట్ హిస్టరీని చూడాలి. ఒక వేళ ఏదైనా పేమెంట్​ అనుమానాస్పదంగా ఉంటే, వెంటనే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి.

మీ ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పవద్దు!
మన ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆన్​లైన్​లో లేదా ఎస్​ఎంఎస్​, వాట్సాప్​ లాంటి యాప్​ల్లో మన ఫైనాన్సియల్​ డేటాను షేర్ చేయకూడదు. ముఖ్యంగా మన బ్యాంక్ అకౌంట్​ నంబర్, పాస్​వర్డ్స్, యూపీఐ పిన్ సహా ఇతర కీలకమైన సమాచారాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.

బ్యాంక్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ - మినిమం బ్యాలెన్స్ లేకపోయినా నో పెనాల్టీ!

రైల్వే 'సూపర్‌' యాప్‌ - అన్ని సేవలు ఒకే చోట - ఇకపై టికెట్​ బుకింగ్​కు నో వర్రీస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.